Home తాజా వార్తలు లొంక కేసోరాంలో మొసలి ప్రత్యక్షం…

లొంక కేసోరాంలో మొసలి ప్రత్యక్షం…

Crocodile

 

రామగిరి: పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం లొంక కేసోరాం గ్రామంలో శుక్రవారం భారీ మొసలి ప్రత్యక్షమైంది. ఇది చూసిన గ్రామస్తులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. లొంక కేసోరాం గ్రామంలోని చెరువు నుండి మొసలి అకస్మాత్తుగా బయటికి రావడంతో అటువైపుగా వెళుతున్న ఉపాధి కూలీలు, వ్యవసాయదారులు హడలెత్తిపోయి అక్కడినుండి పరుగులు తీశారు. ఈ విషయాన్ని సర్పంచ్ ఎండి మంజూర్‌కు తెలియజేయడంతో కల్వచర్ల బీట్ ఆఫీసర్ అమీనొద్దీన్‌కు సమాచారం అందించారు. స్థానికుల సహాయంతో మొసలిని బంధించి మంథని పరిధిలోని ఎల్‌మడుగుకు మొసలిని తరలించారు. దీంతో గ్రామస్తులు ఊపిరి పీల్చుకున్నారు.

 

Crocodile in lonka kesaram village