Home పెద్దపల్లి పంట నష్టం రైతులను ఆదుకోవాలి

పంట నష్టం రైతులను ఆదుకోవాలి

grassమన తెలంగాణ/ముత్తారం: అకాల వర్షానికి నష్టపోయిన వరి,మిర్చి, అరటి రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని ముత్తారం జెడ్పిటిసి చొప్పరి సదానందం తెలిపారు. గురువారం రోజున మండలంలోని లక్కా రం, మచ్చుపేట, ఖాజీపల్లి తో పాటు పలు గ్రామాలల్లో అకా ల వర్షానికి నేలకొరిగిన పంటలను పరిశీలించి, రైతులనుండి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రైతులు ఎంతో కష్టపడి వేసుకున్న పంటలు వడగండ్ల వానకు నేలకొరగడం బాధాకరమన్నారు. గత 2 సంవత్సరాలుగా రైతుకు సరైన దిగుబడి రాక, గిట్టు బాటు ధరలులేక, పెట్టుబడులు సైతం రాని పరిస్థితుల్లో ఉన్న రైతును అకాల వర్షం నిండా ముంచిందన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం సంబంధిత అధికారులతో పంటనష్ఠం అంచనాలు వేసి పరిహారాలు చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సింగిల్ విండో డైరెక్టర్లు మోహన్‌రెడ్డి, మెంగాని తిరుపతి, నాయకులు జగన్‌రెడ్డి, మోహన్‌రెడ్డి, కోమల్‌రెడ్డి, నారాయణ, ఏడుమేకల రాజయ్య, కుక్కల రాజయ్య తదితరులు పాల్గొన్నారు.
పంట నష్టంపై ఉన్నతాధికారులకు నివేదిస్తాం ఎవో
మన తెలంగాణ/ముత్తారం: అకాల వర్షానికి నష్టపోయిన పంట వివరాలను సర్వే చేసి అంచనా నష్టాన్ని ఉన్నతాధికారులకు నివేదిస్తామని మం డల వ్యవసాయాధికారి చిన్నం శ్రీకాంత్ తెలిపారు. గురువా రం వడగళ్ళ వానకు పంట నష్టపోయిన లక్కారం, మచ్చుపేట గ్రామాలలో రైతులతో కలి సి వరి పంటలను పరిశీలించారు. సుమారు 90ఎకరాలకు సంబంధించినప్రాథమిక నష్టం అంచనా వివరాలను నమోదు చేసుకుని పూర్తి నివేదికను ఉన్నతాధికారులకు పంపిస్తామన్నా రు. ఆయన వెంట మచ్చుపేట సర్పంచ్ గోవిందుల పద్మానంద్, రైతులు ఉన్నారు.