Home ఖమ్మం కారేపల్లిలో పోడుపోరు

కారేపల్లిలో పోడుపోరు

khamamam*ఇరువర్గాల మధ్య తోపులాట
*అరకలను కట్టి దున్నిన మహిళలు
*19మందిపై కేసు నమోదు
మన తెలంగాణ/కారేపల్లి: పోడులేకుంటే పొట్ట గడవటం కష్టమని ఎన్నో ఏళ్ళుగా పోడును సాగుచేసుకోని జీవనం గడుపుతున్న తమ బతుకులు రోడ్డుకీడుస్తున్నారని పోడు సాగుదారులు ఆవేధన వ్యక్తం చేస్తున్నారు. మండల కేంద్రంలోని గాంధీనగరం సమీపం లోని పోడు భూమిలో సోమవారం ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. వర్షం కురవడం తో పోడు రైతులు సాగుకు సన్నద్దమైయ్యారు. అరకలను కట్టి దున్నటం ప్రారంభించారు. దీంతో సమాచారం తెలుసుకున్న ఫారెస్టు అధికారులు ఖమ్మం డివి జన్‌లో ఉన్న వివిధ రెంజేల ఫారెస్టు సిబ్బందులతో పోడులో భారీగా మోహిరించారు. పోడుసాగు కుటుంబాల మహి ళలు పోడులో అరకలను కట్టి దున్నతుండగా అటవీశాఖ సిబ్బంది అడ్డుకున్నారు. దీంతా ఇరువర్గాల మధ్య కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అరకలను కట్టిన ఎద్దుల తాళ్లను ఫారెస్టు అధికారులు ఇప్పటానికి ప్రయత్నించగా మహిళలు వారిని అడ్డుకున్నారు. కాగా మహిళలు వారే అరకలను భూజాలపై వేసుకొని దున్నటం ప్రారంభించటంతో ఫారెస్టు మహిళ అధికారులు వారిని సైతం నేట్టి వేసి అరకలను జీపులోకి ఎక్కించే క్రమంలో రైతులకు, అధికారులకు మధ్య గలటా చోటుచేసుకుంది. డిఆర్‌ఒ రామకృష్ణ ఒకానొక సందర్భంలో రైతులపై చేయిచేసుకున్నాడు. దీంతో రైతులు పోడును వదిలిపెట్టే ప్రసక్తే లేదని ఆగ్రహంతో అక్కడే బైటాయించి నిరసన వ్యక్తం చేశారు. సమాచారం తెలుసుకున్న ఇల్లందు రూరల్ సిఐ దోమల రమేష్, కారేపల్లి, కామేపల్లి ఎస్‌ఐలు ముత్తా రవికుమార్, శ్రీనివాస్‌లు సంఘటనా స్థలానికి చేరుకోని రైతులతో మాట్లాడినా ప్రయో జనం లేకపోవటంతో వారు వెనెదిరిగి వెళ్లారు. రైతులకు వైరా సిపిఐ డివిజన్ ఇం చార్జి ఎర్రబాబు, మండల కార్యదర్శి తాతా వెంకటేశ్వర్లు, సిపిఎం మండల కార్యదర్శి కే నాగేశ్వరరావు, ఎన్డీ చంద్రన్న, రాయల వర్గం నాయకులు వై ప్రకాశ్, వై జానకి, గుగు లోత్ తేజ్యా, నాగయ్య, కుర్ర శ్రీనివాస్‌రావు, సిపిఐ, సిపిఎం నాయకులు తురక మల్లేష్, నరెందర్, ఎంపిటిసీలు బోడా కృష్ణవేణి, వజ్జా రామారావులు చేరుకోని వారికి మద్దతుగా నిలిచారు. పోడు సాగుచేస్తున్న రైతులపై ఫారెస్టు అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కారేపల్లి రెంజర్, డిఆర్‌వో సత్య హరిప్రసాద్, రామకృష్ణలు ఫిర్యాదులతో కారేపల్లి పొలీస్‌స్టేషన్‌లో 19మంది రైతులపై కేసులు నమోదు చేశారు.