Tuesday, April 23, 2024

దొంగతుర్తిలో సిఆర్‌పిఎఫ్ జవాన్ అంత్యక్రియలు….

- Advertisement -
- Advertisement -

బాధిత కుటుంబానికి అండగా ఉంటాం
మృతుడి కుటుంబానికి ఫోన్ చేసి హామీ ఇచ్చిన మంత్రి కొప్పుల ఈశ్వర్

మనతెలంగాణ/ధర్మారం : మధ్యప్రదేశ్‌లో సోమవారం తుపాకీతో కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్న సిఆర్‌పిఎఫ్ జవాన్ లైశెట్టి శ్రీనివాస్ మృతదేహానికి మంగళవారం  స్వగ్రామమైన పెద్దపల్లిలో దొంగతుర్తిలో అంత్యక్రియలు నిర్వహించారు. సిఆర్‌పిఎఫ్ జవాన్లతో పాటు కుటుంబ సభ్యులు, ప్రజాప్రతినిధులు, వేలాదిగా తరలి వచ్చి అంతిమ యాత్రలో పాల్గొనగా అశ్రునయనాల మధ్య అంత్యక్రియలు నిర్వహించారు. యువకుడిగా, విద్యావంతుడిగా గ్రామంలో మంచి పేరున్న లైశెట్టి శ్రీనివాస్ అనుహ్యంగా ఆత్మహత్య చేసుకోవడంతో మృతదేహాన్ని చూసి ప్రతి ఒక్కరు కంటతడి పెట్టుకున్నారు. మాజీ సర్పంచ్ జుంజుపల్లి రమేష్ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్ళగా మంత్రి ఈశ్వర్ మృతుడు తండ్రి రాజేశంతో ఫోన్‌లో మాట్లాడారు. కుటుంబానికి అండగా ఉంటానని, తమవంతు సంపూర్ణ సహకారం అందిస్తానని హామీనిచ్చారు. ప్రభుత్వ అధికారిక కార్యక్రమంలో బిజీ ఉన్నందున రాలేకపోయాయని త్వరలోనే కుటుంబాన్ని కలిసి పరామర్శించి తన వంతుగా పూర్తి సహకారాన్ని అందిస్తానని మంత్రి ఈశ్వర్ హామీఇచ్చారు.  ఉన్న ఒక్క కుమారుడు పోలీసు ఉద్యోగంలో చేరి ఆత్మహత్య చేసుకోవడంతో తల్లితండ్రులతో పాటు భార్య రోదనలు మిన్నంటాయి. దొంగతుర్తితో పాటు చుట్టు ప్రక్కల గ్రామాల ప్రజలు శ్రీనివాస్ ఆంత్యక్రియల్లో పాల్గొని నివాళులర్పించారు. గ్రామ సర్పంచ్ పాలకుర్తి సత్తయ్యగౌడ్, ఎంపిటిసి దాడి సదయ్య, ఉపసర్పంచ్ ముత్యాల చంద్రశేఖర్, ధర్మారం ఎస్‌ఐ శ్రీనివాస్‌తో పాటు పోలీస్ సిబ్బంది మాజీ సర్పంచ్ జుంజుపల్లి రమేష్, కాంగ్రెస్ పార్టీ మండలాధ్యక్షులు శ్రీనివాస్, ఎర్రగుంటపల్లి టిఆర్‌ఎస్ పార్టీ గ్రామశాఖ అధ్యక్షులు ఆవుల మల్లేశం అంత్యక్రియల్లో పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News