Home జాతీయ వార్తలు సుక్మా జిల్లాలో మందుపాతర పేల్చిన మావోయిస్టులు : జవాను మృతి

సుక్మా జిల్లాలో మందుపాతర పేల్చిన మావోయిస్టులు : జవాను మృతి

CRPF Jawan Killed In Landmine Blast In Chhattisgarhరాయ్‌పూర్‌: ఛ‌త్తీస్‌గ‌ఢ్ రాష్ట్రం సుక్మా జిల్లాలో మావోయిస్టులు దాష్టికానికి పాల్పడ్డారు. మావోయిస్టులు మందుపాతర పేల్చారు. ఈ ఘటనలో సిఆర్‌పిఎఫ్‌కు చెందిన అసిస్టెంట్ క‌మాండెంట్ నితిన్ భ‌లేరావు (33) అమరులయ్యారు. సెకండ్ ర్యాంక్ కమాండెంట్ స‌హా 10 మంది సిఆర్‌పిఎఫ్ జ‌వాన్లు గాయ‌ప‌డ్డారు. ఈ ఘటన ఆదివారం తెల్లవారుజామున జరిగిందని అధికారులు తెలిపారు. గాయపడిన వారిలో ఏడుగురు జవాన్ల పరిస్థితి విషమంగా ఉండడంతో చికిత్స కోసం వారిని రాయ్ పూర్ ఆసుపత్రికి తరలించారు. స్వల్పంగా గాయపడిన మరో ముగ్గరు జవాన్లను  ద‌క్షిణ బ‌స్త‌ర్ ఏరియాలోని చింత‌ల్‌నార్ ఆసుపత్రికి తరలించారు. గాయపడిన జవాన్లు కోబ్రా విభాగంలోిన 206వ బెటాలియన్ కు చెందిన వారిని అధికారులు వెల్లడించారు. ఈ ఘటనతో సుక్మా జిల్లాలో హైఅలర్ట్ ప్రకటించారు. మావోయిస్టుల కోసం పోలీసులు భారీ ఎత్తున గాలింపు చర్యలు చేపట్టారు.