Saturday, April 20, 2024

10రోజుల పాటు వాక్సినేషన్ డ్రైవ్ కొనసాగుతుంది: సిఎస్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ఉప్పుగూడ వార్డ్ పరిధిలోని పరివార్ కాలనిలో నిర్వహిస్తున్న కోవిడ్ వాక్సినేషన్ కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ పరిశీలించారు. ఈ కార్యాక్రమంలో హాజరైన వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి రిజ్వి, జీహెచ్ఎంసి కమీషనర్ లోకేష్ కుమార్, హైదరాబాద్ కలెక్టర్ శర్మన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సోమేశ్ కుమార్ మాట్లాడుతూ.. ‘హైదరాబాద్ నగరంలో 100శాతం అర్హులైన వారికి చేపట్టిన కోవిడ్ వాక్సిన్ కార్యక్రమం విజయవంతంగా నడుస్తోంది. ప్రజాప్రతినిధులు, కార్పొరేటర్లు ఈ కార్యక్రమములో భాగస్వాములవుతున్నారు. పదిరోజుల పాటు ఈ వాక్సినేషన్ కార్యక్రమం కొనసాగుతుంది. అవసరమైతే పొడగిస్తాం. దేశంలోని ఏ మెట్రో నగరాల్లో ఇంత పెద్ద స్థాయిలో మెగా వాక్సినేషన్ ప్రోగ్రాం నిర్వహించలేదు. ప్రతిఒక్కరు వాక్సిన్ తీసుకోవాలి. ఇళ్లలో ఇంకా మిగిలిన వారికై ఈ ప్రత్యేక వాక్సిన్ కార్యక్రమాన్ని హైదరాబాద్ నగరంలో చేపట్టాం’ అని తెలిపారు.

CS Somesh Kumar Inspects Vaccination drive at Uppuguda

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News