Saturday, March 2, 2024

వ్యాక్సిన్ మూడు రోజులకే ఉంది: సిఎస్

- Advertisement -
- Advertisement -

CS Somesh kumar letter to Union Health Secretary

టీకా కొరత లేకుండా చూడండి
కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శికి సిఎస్ లేఖ

హైదరాబాద్ : కరోనా వ్యాక్సిన్ కొరత లేకుండా చూడాలని కోరుతూ కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేష్ భూషణ్‌కు సిఎస్ సోమేష్‌కుమార్ లేఖ రాశారు. తెలంగాణలో మూడు రోజులకు మాత్రమే వ్యాక్సిన్ డోసులు మిగిలి ఉన్నాయని ఆయన లేఖలో పేర్కొన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 5.66 లక్షల డోసుల వ్యాక్సిన్ మాత్రమే అందుబాటులో ఉందని తెలిపారు. రోజుకు 1.15 లక్షల దోసుల వ్యాక్సిన్ పంపిణీ చేస్తున్నామని, రాబోయే రోజుల్లో రోజుకు 2 లక్షల డోసులు పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. వచ్చే 15 రోజులకు సరిపడే విధంగా కనీసం 30 లక్షల డోసులు వెంటనే పంపిణీ చేయాలని సిఎస్ సోమేష్‌కుమార్ లేఖలో కోరారు.

CS Somesh kumar letter to Union Health Secretary

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News