Home తాజా వార్తలు జోన్లవారీ ఉద్యోగుల విభజనకు కమిటీలు

జోన్లవారీ ఉద్యోగుల విభజనకు కమిటీలు

CS somesh kumar meeting with employees union leaders

 

రాష్ట్ర, జిల్లా స్థాయిల్లో ఏర్పాటు : సిఎస్ సోమేశ్ కుమార్
ఉద్యోగుల విభజనలో స్థానికతకే ప్రాధాన్యం ఇవ్వాలి : టిఎన్‌జిఒ

మనతెలంగాణ/ హైదరాబాద్: ఉద్యోగులందరికీ క్యాడర్‌ల వారిగా ఆప్షన్స్ ఇచ్చి, కేటాయింపు అవకాశం కల్పిస్తామని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ హామీ ఇచ్చారు. సిఎం కెసిఆర్ సూచనల మేరకు ఆదివారం బిఆర్‌కెఆర్ భవన్‌లో టిజిఓ, టిఎన్‌జిఓ ఉద్యోగ సంఘాలతో రాష్ట్రపతి ఉత్తర్వులు- 2018 ప్రకారం జిల్లాలు, జోన్‌లు, మల్టీ జోన్ల వారిగా వివిధ శాఖలు వారిగా పోస్టులు, ఉద్యోగుల కేటాయింపుపై ఆయన సమావేశం నిర్వహించారు. ఉమ్మ డి జిల్లాల పరిధిలో కొత్తగా ఏర్పాటైన జిల్లాలకు స్థానిక కేడర్‌ల వారిగా పోస్టులు, ఉద్యోగుల కేటాయింపుపై ఉద్యోగ సంఘా ల రాష్ట్ర అధ్యక్షులు, ప్రతినిధులతో సోమేష్‌కుమార్ చర్చించారు. ఈ ప్రక్రియను సజావుగా పూర్తి చేసేందుకు రాష్ట్ర, జిల్లా స్థాయి కమిటీలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. టిజిఓ, టిఎన్‌జిఓ ఉద్యోగ సంఘాలతో పాటు ప్రభుత్వంతో గుర్తింపు పొందిన జిల్లా స్థాయి ఉద్యోగుల సంఘాలను కేటాయింపు సమయంలో ఆహ్వానించనున్నట్లు తెలిపారు.

ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులో లేని జిల్లాల్లో మొదటి దశలో పోస్టులు, ఉద్యోగుల కేటాయింపు ప్రక్రియ చేపట్టబడుతుంది. మిగిలిన జిల్లాల్లో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఎత్తివేసిన తర్వాత చేపడుతామని వెల్లడించారు. అనంతరం టీఎన్జీవో ప్రెసిడెంట్ మామిడ్ల రాజేందర్ మాట్లాడుతూ పరిపాలన సౌలభ్యం కోసం ఏర్పడిన33 జిలాల్లో ఏ జిల్లా ఉద్యోగిని అక్కడే సర్దుబాటు చేయాలని కోరారు. రాష్ట్రంలో పనిచేస్తున్న ఏ ఉద్యోగికి నష్టం జరగకుండా ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ప్రకారం నిర్ణయం తీసుకోవాలని కోరాం. సిఎం కెసిఆర్ రెండు దఫాలుగా చర్చలు జరిపారు.ఏ జిల్లా ఉద్యోగిని ఆ జిల్లాలోనే సర్దుబాటు చేయాలని కోరాం. మా సూచనలు సలహాలు పాటిస్తాం వెల్లడించారు. భార్యాభర్తలు,ఇతర వ్యాధులతో బాధపడుతున్న వారికి కూడా ప్రాధాన్యత ఇవ్వాలని విజ్ఞప్తి చేశాం. ఎస్సి,ఎస్టీ కులాల వారికి రోస్టర్ విధానం పాటించాలని కోరాం.

ఉద్యోగుల పని భారం తగ్గించేందుకు సిఎం కేసీఆర్ కృషి చేస్తున్నారు. కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు 30 శాతం పీఆర్సీ ఇచ్చిన ఘనత తెలంగాణ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. ఉద్యోగ సంఘాల అధ్యక్షురాలు మమత మాట్లాడుతూ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేసేలా సిఎం కెసిఆర్ ఆలోచన చేస్తున్నారు. ఉద్యోగుల విభజనలో సీనియారిటీ పద్దతిగా,లోకల్ క్యాడర్‌కు అనుకూలంగా జరుగుతుంది. వివిధ విభాగాల ఉద్యోగులు ఈ విభజనకు సహకరించాలి. ఈ నెల లోపలనే ఆప్షన్ ఉంటాయి. ఈ ఆప్షన్‌లు ఆఫ్ లైన్‌లోనే ఉంటాయి. ఉద్యోగుల నోటిఫికేషన్‌లపై సిఎం కెసిఆర్‌తో త్వరలోనే భేటి అవుతామని తెలిపారు. ఈ సమావేశంలో సాధారణ పరిపాలన శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ వికాస్‌రాజ్, స్టాంపులు, రిజిష్ట్రన్‌ల సిఐజి శేషాద్రి, ఆర్ధికశాఖ కార్యదర్శి రోనాల్ రోస్, ఉద్యోగుల సంఘాల నేతలు పాల్గొన్నారు.

CS somesh kumar meeting with employees union leaders