Wednesday, April 24, 2024

కరోనా వ్యాప్తి కంట్రోల్ లోనే ఉంది: సిఎస్

- Advertisement -
- Advertisement -

CS Somesh Kumar Press Meet on Coronavirus

హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా వ్యాప్తి కంట్రోల్ లోనే ఉందని తెలంగాణ సిఎస్ సోమేశ్ కుమార్ పేర్కొన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ… కరోనా పై వైద్యులు, అధికారులు పోరాటం చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. ఇతర రాష్ట్రాలకంటే  తెలంగాణలో పరిస్థితి మెరుగ్గా ఉందని ఆయన తెలిపారు. కరోనా కట్టడికి ఎంత డబ్బు అయినా ఖర్చు చేయమని సిఎం చెప్పారు. ఇంకా ఆక్సిజన్ బెడ్స్ పెంచామని సిఎం ఆదేశించారు. రాష్ట్రంలో 135 మెట్రిక్ టన్నుల మెడికల్ ఆక్సిజన్ మాత్రమే ఉత్పత్తి అవుతుందని సిఎస్ చెప్పారు. ఒడిశా నుంచి ఆక్సిజన్ ట్యాంకర్ నింపుకొని రావడానికి ఆరు రోజుల సమయం పడుతుందన్నారు. ఎయిర్ లిఫ్ట్ చేయడం వల్ల మూడ్రోజుల సమయం ఆదా అవుతుందన్నారు. ప్రతి జిల్లాలో ఆర్టీపిసిఆర్ పరీక్షలు చేసేలా ఏర్పాట్లు చేశామని ఆయన వెల్లడించారు. కరోనా లక్షణాలు ఉంటే చికిత్స చేయాల్సిందేనని సిఎస్ సోమేష్ కుమార్ తెలిపారు. కరోనా లక్షణాలు ఉన్నా నిర్లక్ష్యం చేసిన వారు ఇబ్బంది పడుతున్నారు. సొంతవైద్యం చేయవద్దు.. ఆస్పత్రులకు వెళ్లండని సూచించారు. కోవిడ్ లక్షణాలు ఉంటే చికిత్స అందించాలని ఐసిఎంఆర్ కూడా చెప్పిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. 45 ఏళ్లు పైబడిన వారికి వ్యాక్సినేషన్ కొనసాగుతుంది. సరఫరా తగ్గడం వల్ల నమోదు చేసుకున్న వారికే వ్యాక్సిన్ ఇస్తున్నాం. తగినంత వ్యాక్సిన్ సరఫరా లేకనే 18-44 ఏళ్ల వారికి వ్యాక్సినేషన్ ప్రారంభించాలేదని వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News