Friday, April 26, 2024

వైద్యరంగంలో రోల్ మోడల్‌గా రాష్ట్రం

- Advertisement -
- Advertisement -

తదనుగుణంగా కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేయండి
అధికారులకు సిఎస్ సోమేశ్‌కుమార్ ఆదేశం

CS Somesh Kumar review meeting with Health Officials

మనతెలంగాణ/హైదరాబాద్:వైద్య రంగంలో తెలంగాణ రాష్ట్రం రోల్ మోడల్‌గా నిలిచేలా కార్యాచరణ ప్రణాళికను రూపొందించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ సంబంధిత అధికారులను ఆదేశించారు. నేషనల్ ఫ్యామిలి హెల్త్ సర్వే-5 ప్రకారం కొన్ని అంశాలలో మెరుగుదల కోసం చేపట్టవలసిన అంశాలపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మంగళవారం బిఆర్ కెఆర్ భవన్ లో సమీక్ష సమావేశం నిర్వహించారు. మహిళలకు గర్భస్థ పరీక్షలు, అనిమియా, పుట్టిన గంటలోగా తల్లిపాలపై అవగాహన, మహిళలు, తల్లులలో పౌష్టిక ఆహారం లోపనివారణ, తదితర అంశాలపై దృష్టి సారించాలని ఈ సందర్భంగా ఆయన ఆదేశించారు. సర్వేలో వెల్లడించిన అంశాలను విశ్లేషించి వివిధ పారామీటర్లలో మెరుగుదల కోసం అవసరమైన వ్యూహాన్ని రూపొందించాలని ఆదేశించారు. సమావేశంలో ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కార్యదర్శి రిజ్వీ, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమీషనర్ వాకటి కరుణ, శిశు సంక్షేమ శాఖ ప్రత్యేక కార్యదర్శి డి. దివ్య, మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ డాక్టర్. రమేశ్ రెడ్డి, డైరెక్టర్, ఐపిఎం డాక్టర్ కె.శంకర్, టెక్నికల్ అడ్వైజర్ డా. టి. గంగాధర్, సెస్ డైరెక్టర్ .రేవతి, సిఇజిఐఎస్ సెంటర్ హెడ్ రాజేంద్ర అధికారులు పాల్గొన్నారు.

CS Somesh Kumar review meeting with Health Officials

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News