Home తాజా వార్తలు కరోనా పరిస్థితులపై సిఎస్ సోమేశ్ కుమార్ సమీక్ష

కరోనా పరిస్థితులపై సిఎస్ సోమేశ్ కుమార్ సమీక్ష

CS Somesh Kumar Review On Corona Conditionsహైదరాబాద్‌ : తెలంగాణలో కరోనా పరిస్థితలపై సిఎస్ సోమేశ్ కుమార్ శనివారం ఉన్నత స్థాయి సమీక్ష చేశారు. రాష్ట్ర సచివాలయంలో జరిగిన ఈ సమీక్షా సమావేశానికి సంబంధిత శాఖల అధికారులు హాజరయ్యారు. కరోనా పట్ల అప్రమత్తంగా ఉండాలని సిఎస్ సోమేశ్ కుమార్ అధికారులను ఆదేశించారు. మూడో దశ సన్నద్ధతపై అధికారులతో సిఎస్ చర్చించారు. నూతన వైద్య కళాశాలల ఏర్పాటుపై కూడా ఆయన అధికారులతో సమీక్షించారు. మూడో దశ కరోనా ఉధృతి వ్యాప్తి చెందకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని, కరోనా పట్ల ప్రజల్లో మరింత అవగాహన తేవాలని, కరోనా నిబంధనలను కచ్చితంగా పాటించేలా ప్రజలను చైతన్యవంతం చేయాలని సిఎస్ అధికారులకు సూచించారు.