Wednesday, November 13, 2024

తొందరగా పదోన్నతులు

- Advertisement -
- Advertisement -

తొందరగా పదోన్నతులు

డిపిసిలను వెంటనే నిర్వహించండి

వివిధ శాఖల్లో ప్రమోషన్లపై సమీక్షలో సిఎస్ సోమేష్‌కుమార్ ఆదేశాలు

CS Somesh review on Republic day celebrations

మనతెలంగాణ/హైదరాబాద్: సచివాలయ స్థాయి నుంచి జిల్లా స్థాయి కార్యాలయాల వరకు అన్ని విభాగాల్లో పదోన్నతుల ప్రక్రియను వేగవంతం చేయాలని, డిపిసిలను వెంటనే నిర్వహించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ అధికారులను ఆదేశించారు. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆదేశాల మేరకు సిఎస్ సోమేశ్ కుమార్ శనివారం ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులు, కార్యదర్శులతో వివిధ శాఖల్లో పదోన్నతుల ప్రక్రియ పై సమీక్షించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ప్రతి శాఖలో పదోన్నతులపై సమీక్షించి, ఈ ప్రక్రియకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తున్నందున, పదోన్నతుల్లో ఉండే సాంకేతిక సమస్యలను పరిష్కరించి మార్గదర్శకాల ప్రకారం డిపిసిలను నిర్వహించాలని సిఎస్ ఆదేశించారు. ఈ సమావేశంలో మున్సిపల్ శాఖ ముఖ్యకార్యదర్శి అర్వింద్ కుమార్, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి కె.రామకృష్ణారావు, జిఏడి ముఖ్యకార్యదర్శి వికాస్ రాజ్, ఐటి శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్, రహదారులు, భవనాల శాఖ ముఖ్యకార్యదర్శి సునీల్ శర్మ, యువజన సర్వీసుల ముఖ్య కార్యదర్శి సబ్యసాచి ఘోష్, ఆర్థిక శాఖ కార్యదర్శి రోనాల్డ్ రోస్, ఆర్థిక శాఖ సీనియర్ కన్సల్టెంట్ శివ శంకర్ ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

CS Somesh Kumar review on Promotions of Govt Employees

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News