Thursday, April 25, 2024

చెన్నైకి మరో షాక్..

- Advertisement -
- Advertisement -

CSK All Rounder Bravo Ruled out of IPL 2020

దుబాయి: ఇప్పటికే వరుస ఓటములతో సతమతమవుతున్న చెన్నై సూపర్ కింగ్స్‌కు మరో షాక్ తగిలింది. అనారోగ్యం కారణాలతో దిగ్గజ ఆల్‌రౌండర్ డ్వేన్ బ్రావో ఐపిఎల్‌కు దూరమయ్యాడు. ఈ విషయాన్ని సిఎస్‌కె సిఇఓ విశ్వనాథన్ స్వయంగా వెల్లడించారు. ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేసే సత్తా కలిగిన బ్రావో దూరం కావడం చెన్నైకు పెద్ద లోటుగా చెప్పాలి. ఢిల్లీతో జరిగిన మ్యాచ్‌లో కండరాలు పట్టేయడంతో బ్రావో అర్ధాంతరంగా మైదానాన్ని వీడాల్సి వచ్చింది. ఆ తర్వాత పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో కూడా అతను బరిలోకి దిగలేదు. ఇక అతనికి నిర్వహించిన వైద్య పరీక్షల్లో కనీసం నాలుగు వారాల విశ్రాంతి అవసరమని తేలింది. దీంతో బ్రావో ఐపిఎల్ మొత్తానికి అందుబాటులో లేకుండా పోయాడు.

CSK All Rounder Bravo Ruled out of IPL 2020

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News