Home IPL 2019 టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఢిల్లీ

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఢిల్లీ

 

న్యూఢిల్లీ: ఐపిఎల్ 12 సిజన్లో భాగంగా జరుగుతున్న లీగ్ మ్యాచ్ ల్లో మరో ఆసక్తికర పోరుకు రంగం సిద్ధమైంది. ఫిరోజ్‌ షా కోట్ల మైదానం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్‌, చెన్నై సూపర్‌ కింగ్స్‌ జట్ల తలపడుతున్నాయి. ఈ మ్యాచ్ లో ఢిల్లీ జట్టు టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకుంది.

ట్రెంట్‌ బౌల్ట్‌ స్థానంలో స్పిన్నర్‌ అమిత్‌ మిశ్రా జట్టులోకి ఎంపిక చేసినట్లు ఢిల్లీ కెప్టెన్‌ శ్రేయాస్‌ అయ్యర్‌ తెలిపాడు. కాగా, రెండు జట్లు కూడా ఆడిన తొలి మ్యాచ్‌ల్లో గెలుపొంది మంచి జోష్ లో ఉన్నాయి. ఇక పటిష్టమైన చెన్నై జట్టుపై ఎలాగైనా గెలవాలనే పట్టుదలతో ఢిల్లీ జట్టు బరిలోకి దిగుతోంది. మరోవైపు చెన్నై జట్టు తన జైత్రయాత్రను కొనసాగించాలని భావిస్తోంది.

CSK vs DC: Delhi Capitals opt Bat