Home Default ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి పెట్టండి : మార గంగారెడ్డి

ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి పెట్టండి : మార గంగారెడ్డి

Cultivate Alternative Crops Instead Of Paddyఆర్మూర్‌ : వచ్చే యాసంగిలో వరి పంటకు బదులుగా ప్రత్యామ్నాయ పంటలపై రైతులు దృష్టి సారించి, సాగు చేయాలని తెలంగాణ రాష్ట్ర మార్క్​‍ఫెడ్‌ చైర్మన్‌ మార గంగారెడ్డి కోరారు. ఆర్మూర్‌ మండల పరిధిలోని అంకాపూర్‌ గ్రామ సొసైటీ ఆవరణలో గురువారం వరి పంటపై రైతులకు అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ సదస్సుకు హాజరైన గంగారెడ్డి  మాట్లాడారు.  వచ్చే సీజన్‌లో వరి పంటకు బదులు వేరే పంట సాగయ్యే భూముల్లో కచ్చితంగా ప్రత్యామ్నాయ పంటలను సాగు చేయాలని ఆయన స్పష్టం చేశారు. వేరే పంటలు పండని భూముల్లో వరి సన్నరకాలను రైతులు సాగు చేయాలని ఆయన చెప్పారు. ఆరుతండి పంటలైన పొద్దుతిరుగుడు, వేరుశనగ, మొక్కజొన్న తదితర వాటిని సాగు చేయాలని ఆయన పేర్కొన్నారు. ఖరీఫ్ లో పండిన వరి ధాన్యాన్ని నిబంధనల మేరకు రైతులు కొనుగోలు కేంద్రాలకు తేవాలని ఆయన తేల్చిచెప్పారు. ఈ సదస్సులో అంకాపూర్‌ సర్పంచ్‌ మచ్చర్ల పూజితారెడ్డి, ఉపసర్పంచ్‌ మచ్చర్ల కిశోర్‌రెడ్డి, సొసైటీ డైరెక్టర్లు, ఆర్మూర్‌ ఏడీఏ హరికృష్ణ, ఏఈఓ సవిత, ఎంపీటీసీలు ఎంసీ.గంగారెడ్డి, మంగ్లారం మహేందర్‌, రైతులు పాల్గొన్నారు.