Wednesday, March 22, 2023

యాసంగికి సాగు నీరు కలే

- Advertisement -

 

jcb

ఉమ్మడి జిల్లాలో యాభై వేల ఎకరాలకు ప్రశ్నార్థకమే
కూలిన మేడారం స్వప్నంకు మరో మాసం
రెండు రోజుల్లో నిపుణుల నివేదిక
రైతాంగానికి నీరు కష్టమే

మనతెలంగాణ/ధర్మారం: రబీకి సాగునీరు ప్రశ్నార్థకంగా మారింది.ఉమ్మడి జిల్లాలోని యాభైవేల ఎకరాలకు యాసంగి పంట నీరివ్వాలనే ప్రణాళిక ఆచరణ లో అమలు కష్టంగానే ఉండి. ఎల్లంపల్లి ప్రాజెక్టులో ని ల్వ వున్న నీటిని మేడారం ప్రధాన రిజర్వాయర్ ద్వా రా పంప్‌హౌజ్‌ల సహకరంతో పెద్దపల్లి,జగిత్యాల, రా జన్న సిరిసిల్ల,కరీంనగర్ జిల్లాలకు జనవరి మొదటి వారంలో అందించాలనే ప్రభుత్వం నిర్ణయానికి బ్రేక్ పడింది. ప్రభుత్వం అధికార యంత్రాంగం ప్రకటనల తో రబీ పనుల్ని షురూ చేసిన రైతాంగానికి మరో మా సం వరకు నీరు అందే అవకాశాలు లేకుండా పోయా యి. ఎల్లంపల్లి పూర్తి స్థాయి మట్టం 20.175 టిఎంసి లు కాగా,19.09 టిఎంసిల నీరు నిల్వ ఉంది. వెంటనే మేడారం రిజర్వాయర్‌కు అక్కడి నుంచి పంప్ హౌజ్‌ల ద్వారా గంగాధర మండలం నారాయణపూర్‌కు అక్క డి నుండి పోతారం రిజర్వాయర్‌లకు సరఫరా చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. 0.18టిఎంసి సా మర్థం గల మేడారం రిజర్వాయర్‌ను రూ.77కోట్లతో ఆధునీకరిస్తూ 0.78 టిఎంసిలకు పెంచే పనులు శరవేగంగా నడుస్తున్నాయి.కంట్రాక్టర్,ఆధునీకరిస్తూ 0. 78టిఎంసిలకు పెంచే పనులు శరవేగంగా నడుస్తున్నాయి. కంట్రాక్టర్, అధికార యంత్రాంగం అహర్నిశలు శ్రమిస్తూ రిజర్వాయర్ ప్రధాన కట్ట భాగాన్ని ని ర్మిస్తుండగానే గత డిసెంబర్ 16 నాడు రెండవ భా గంలో కట్ట కుంగి కూలిపోయింది. జనవరి 1 వరకు నీరివ్వాలనే ఆశయం కాస్తా జనవరి 15 డెడ్‌లైన్‌గా మారిన పరిస్థితిలో మార్పులేక పోవడం గమనార్హం. ప్రొఫెసర్లు, సీనియర్ ఇంజనీర్ల బృందం నుండి ఇప్పటి వరకు నివేదిక రాక పోగా మరో రెండు రోజులు పట్ట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం కట్ట కింది భా గంలో నింపిన మట్టిని తోలిచే ప్రయత్నాలు శరవేగం గా జరుగుతున్నాయి. నిపుణులు కమిటీ నివేదికలో వ ంద మీటర్లు తోడాలని నివేదించిన పదిరోజులు, రెండు వందల మీటర్లు తోడాలని నివేదించిన 20రోజులు ప ట్టే అవకాశాలున్నాయి. లోపలి భాగం నిపుణుల నివేది క ఆధారంగా పూర్తి చేసి పైన కట్ట నిర్మాణం జరిగే వర కు మాసం రోజులు గడిచే అవకాశాలున్నాయి. దీం తో ఎల్లంపల్లి నుంచి మేడారం కేంద్రంగా నాలుగు జి ల్లాలోని యాభై వేల ఎకరాలకు యాసంగిలో నీరంద డం కష్టంగానే మారింది.మేడారం రిజర్వాయర్ స్వ ప్నం కూలిన స్థానంలో పనులు నిర్వహించి, ఆనకట్ట నిర్మాణం జరిగే వరకు మేడారంలో నీటిని నిల్వచేసి ప ంపు హౌజ్‌ల ద్వారా పంపడం సాధ్యం కాదని స్పష్టమవుతుంది. యాసంగి పంటకు నీరివ్వడంతోపాటు ఉ మ్మడి జిల్లాలోని 70 చెరువుల్ని పూర్తి స్థాయిలో నింపాలనే లక్షానికి అదిలోనే అడ్డంకులు ఏర్పడ్డాయి. రబీపై ఆశలు పె ట్టుకున్న ఉమ్మడి జిల్లా రైతాంగం కలలు కలగానే మి గిలే అవకాశం ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News