Sunday, March 26, 2023

సంస్కృతి, సంప్రదాయాలకు ప్రాధాన్యం

- Advertisement -

women

*సేవాలాల్ ఆశయాలను కొనసాగిస్తాం *జిల్లా కేంద్రంలో కోటి రూపాయలతో బంజారా భవనం
*రాష్ట్ర మంత్రి జోగురామన్న *ఘనంగా సేవాలాల్ జయంతి వేడుకలు

మన తెలంగాణ/ఆదిలాబాద్ ఆరాధ్య దైవం సంత్ సేవాలాల్ మహరాజ్ ఆశయాలను కొనసాగిస్తామని రాష్ట్ర అటవీ, పర్యావరణ, బిసి సంక్షేమ శాఖ మంత్రి జోగురామన్న అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని రాంలీలా మైదానంలో సేవాలాల్ మహరాజ్ జయంతిని అధికారికంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రి జోగురామన్న ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా సేవాలాల్ మహరాజ్ చిత్రపటానికి పూలమాలలు వేసి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం మంత్రి రామన్నను సేవాలాల్ జయంతి ఉత్సవ కమిటీ నాయకులు శాలువాలతో సత్కరించి జ్ఞాపికలను అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఉమ్మడి రాష్ట్రంలో సంస్కృతి సాంప్రదాయాలు కనుమరుగయ్యాయని ఆరోపించారు. స్వరాష్ట్రంలో టిఆర్‌ఎస్ ప్రభుత్వం సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుతుందన్నారు. మహనీయుల చరిత్రను మరిచిపోకుండా ప్రభుత్వమే జయంతి, వర్ధంతులను అధికారికంగా నిర్వహిస్తుందన్నారు. సంత్ సేవాలాల్ శాంతి స్వరూపుడని ఆయన అడుగుజాడల్లో బంజారాలు నడుచుకోవాలన్నారు. దేవునికి కులం మతం లేదని అలాగే సిఎం కెసిఆర్‌కు కూడా కులమతాల పట్టింపు లేదన్నారు. గతంలో ఎన్నడూలేని విధంగా సిఎం జోడేఘాట్‌కు వచ్చి ప్రత్యేక పూజ కార్యక్రమాలను నిర్వహించారన్నారు. నీతి నిజాయితీకి పెద్ద పీట వేసిన బంజారాలను గౌరవం తెచ్చిన మహనీయుడు సేవాలాల్ అని కొనియాడారు. ఆయన జయంతిని ప్రభుత్వం అధికారికంగా జరుపుకోవడం ఆనందంగా ఉందన్నారు. బోథ్ ఎంఎల్‌ఎ రాథోడ్ బాపురావ్ మాట్లాడుతూ సేవాలాల్ మహరాజ్ పుట్టుకతో బ్రహ్మచారి అని కొనియాడారు. ఆయన అడుగు జాడల్లో బంజారాలంతా నడుచుకోవాలన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ప్రాశ్చాత్య సంస్కృతికి అలవాటు పడడంతో యువత సంస్కృతి సాంప్రదాయాలను మరిచిపోయారన్నారు. స్వరాష్ట్రంలో సంస్కృతి సాంప్రదాయాలను గౌరవం దక్కిందన్నారు. ప్రజలంతా సన్మార్గంలో నడుచుకొని చెడు వ్యవసానాలకు దూరంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ దివ్య దేవరాజన్, ఆదిలాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ ఆరె రాజన్న, ఇచ్చోడ మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్ ఆడెశీల, బంజార సేవా సంఘం నాయకులు అమర్‌సింగ్ తిలావత్, జయవంత్‌రావు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News