Friday, April 19, 2024

ఎపిలో నెలాఖరు వరకు కర్ఫ్యూ పొడిగింపు

- Advertisement -
- Advertisement -

Curfew extension until end of month in AP

అమరావతి: కరోనా కేసులు పెరుగుతున్న క్రమంలో ఎపి సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఆంధ్రప్రదేశ్ లో ఈ నెలాఖరు వరకు కర్ఫ్యూ పొడిగిస్తూ ఎపి ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. కనీసం 4వారాలు కర్ఫ్యూ ఉంటేనే సరైన ఫలితాలు వస్తాయని సిఎం జగన్ మోహన్ రెడ్డి పేర్కొన్నారు. కర్ఫ్యూ విధించి 10 రోజులే అయిందని సిఎం తెలిపారు. పరిస్థితి అదుపులోకి రావాలంటే మరికొంత సమయం పడుతుందని ఆయన పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో కేసులు పెరగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. వాలంటీర్లు, ఆశావర్కర్లు, సచివాలయాలను సమర్థవంతంగా వినియోగించుకోవాలన్నారు. కరోనా మహమ్మారి బారినపడి తల్లిదండ్రులను కోల్పోయి అనాథలైన పిల్లలకు ఆర్థికసాయంపై కార్యచరణ మొదలు పెట్టాలని అధికారులకు చెప్పారు.

Curfew extension until end of month in AP

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News