Home జాతీయ వార్తలు టెన్షన్.. టెన్షన్

టెన్షన్.. టెన్షన్

  • కశ్మీర్‌లో కర్ఫూ తరహా ఆంక్షలు
  • తిరగుముఖం పట్టిన యాత్రికులు

kashmir_CRPF

శ్రీనగర్ : హిజ్బుల్ ముజాహిద్దీన్ కమాండర్ సబ్జర్ భట్ హత్య నేపథ్యంలో శాంతిభద్రతల సమస్య తలెత్తకుండా ప్రభుత్వ యంత్రాంగం కశ్మీర్ వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఆదివారం కర్ఫూ తరహా ఆంక్షలు విధించింది. ఇక్కడి ఏడు పోలీసు స్టేషన్‌ల పరిధిలో ఉన్న ఖాన్యర్, నౌహట్ట, సఫకాదల్, ఎంఆర్ గంజ్, రైనావారి, క్రాల్‌కుద్, మైసుమా ప్రాంతాల్లో విధించిన ఆంక్షలు తదుపరి ఆదేశాలను జారీ చేసేంత వరకు కొనసాగుతాయని అధికారులు వెల్లడిం చారు. అయితే పోటీ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులు తమ ప్రవేశ కార్డులను కర్ఫూ పాసులుగానూ పరిశీలకు లు తమ గుర్తింపు కార్డులను కర్ఫూ పాసులుగానూ విని యోగించుకోవచ్చని తెలిపారు. మరోవైపు ఇక్కడి కాలేజీలు, స్కూళ్లను నేటి వరకు నిరవధికంగా మూసివేసేం దుకు జిల్లా యంత్రాంగం ఆదేశాలు జారీ చేసింది. దక్షిణ కశ్మీర్ లోని అనంత్‌నాగ్, పుల్వామా, సోపియాన్ జిల్లాల్లో అదే విధంగా ఉత్తర కశ్మీర్‌లోని సోపోర్ టౌన్‌షిప్‌లోనూ ఆంక్ష లు విధించామని అధికారులు తెలిపారు. మధ్య కశ్మీ ర్‌లోని బుద్గామ్, గందర్‌బల్ జిల్లాల్లో 144 సెక్షన్ విధించా మన్నారు. దక్షిణ కశ్మీర్‌లోని పుల్వామా జిల్లా, త్రాల్ ప్రాం తంలో హిజ్బుల్ కమాండర్ భట్ హతమైన నేపథ్యంలో చోటుచేసుకుంటున్న హింసాత్మక ఘటనలు మరింత తీవ్రరూపు దాల్చకుండా ఆంక్షలను విధిస్తున్నామని వారు తెలిపారు. వేర్పాటువాద గ్రూపులు ఇచ్చిన రెండ్రోజుల బంద్ పిలుపుతో కశ్మీర్ లో యలోని ప్రతిచోటా సాధారణ ప్రజా జీవితం స్తం భించిపోయింది. పలు ప్రాంతాల్లో ఆం దోళనకారులకు, భద్రతా దళాలకు మధ్య శనివారం జరిగిన ఘర్షణల్లో కనీసం 30 మంది కి గాయాలయ్యా యి. కశ్మీర్‌లో ఉద్రిక్త నేపథ్యంలో టూరిస్టులు వణికి పోతున్నారు. స్వస్థలాలకు తిరుగుము ఖం పడుతున్నారు. దీంతో ఎయిర్‌పోర్ట్ కిటకిటలాడుతుంది. కాగా, భట్ మృత దేహా న్ని త్రాల్‌లోని రస్తునాలో ఉన్న శ్మశానవాటికలో ఆదివారం ఉదయం ఖననం చేశారు. ఈ క్రతువుకు వందలాది మంది హాజరుకావడం గమనార్హం.