Home జాతీయ వార్తలు విప్లవాత్మక నిర్ణయం : అన్నా హజారే

విప్లవాత్మక నిర్ణయం : అన్నా హజారే

anna-hazare

మన తెలంగాణ, న్యూఢిల్లీ: పెద్ద నోట్ల రద్దును అన్నాహజారే స్వాగతించారు. అవినీతి రహిత భారతావని రూపకల్పనలో మొదటి అడుగుగా పెద్దనోట్ల రద్దును అభివర్ణించారు. పెద్ద నోట్ల రద్దుతో అవినీతిపరుల కు, అక్రమార్కులకే తప్ప గ్రామాల్లో ఉంటున్న సామాన్యులకు వచ్చిన ఇబ్బంది ఏమీ లేదని అన్నారు.

ఇక రెండో అడుగు ఎన్నికల సంస్కరణలపై రావాలని కోరారు. నల్లధనం సాయంతో ఎన్నికల్లో గెలిచే సంస్కృతికి చరమగీతం పాడేలా ఎన్నికల ఖర్చుపై పక్కాగా ఆడిటింగ్ నిర్వహించే వ్యవస్థను ఏర్పాటు చేయాలని కేంద్రాన్ని కోరారు. అవినీతికి రహితంగా ఇకపై కూడా తన పోరాటం కొనసాగుతుందని అన్నారు. పేదలకు, అణగారిన వర్గాలను చేయూతనివ్వాలని అన్నారు.