Home కుమ్రం భీం ఆసిఫాబాద్ కర్రసాయంతో కరెంట్ తీగలు

కర్రసాయంతో కరెంట్ తీగలు

Wood-Pole

బెజ్జూర్ : బెజ్జూర్ మండలంలోని మర్కిడి గ్రామంలో కొన్ని నెలల నుండి కర్ర సాయంతో కరెంట్ తీగలు ఉన్నాయి. కరెంట్ అధికారులకు పలు మార్లు చెప్పినప్పటికీ పట్టించు కోవడంలేదని గ్రామ ప్రజలు వాపోతున్నారు. మర్కిడి గ్రామంలో కొయ్య సాయంతో ఇంటి ముందరా కరెంట్‌తీగ దర్శనమిస్తుంది. గాలి దుమరంతో కొయ్య ఏ సమయంలో ఎప్పుడు పడిపోతుందో తెలియక గ్రామ ప్రజలు భయాందోళనకు గురౌతున్నారు. అంతేకాకుండా గ్రామంలో పలు విద్యుత్ స్తంభలు కూడా పడిపోయి ఆవకాశాలు ఉన్నాయి. ఈ విషయం పై అధికారులు స్పందించి గ్రామంలో వేలాడుతున్న విద్యుత్ తీగలను మరియు కర్ర సాయంతో ఉన్న కరేంట్ తీగను తోలగించి నూతన విద్యుత్ స్తంభం ఏర్పాటు చేయాలని గ్రామ ప్రజలు కోరుతున్నారు.

విద్యుత్ స్థంభం ఏర్పాటు చేయాలి: మాది మర్కిడి గ్రామం మా ఇంటి ముందే కరేంట్ తీగలు వేలాడడంతో కర్రసాయంతో కరేంట్ తీగలకు అమర్చము కాని గాలులు విచీన సమయంలో కర్ర ఉగుతుంది.ఏ సమయంలో కర్ర పడిపోతుందో తెలియని పరిస్ధితి కర్ర ఉడిపోయినట్లు అయితే విద్యుత్ తీగలు ఇంటి పైనే పడిపోయే ఆవకాశాలు ఉన్నాయి.ఈ విషయం అధికారులుస్పందించి స్తంభం ఏర్పాటు చేయాలి. – బసరత్‌ఖాన్

అధికారులు స్పందించండి: మాది మర్కిడి గ్రా మం రోడ్డు పక్కనే కర్ర సాయంతో కరెంట్ తీగ లున్నాయి. ఈ కరెంట్ తీగల గురించి కరెంట్ సార్లకు ఎన్నిసార్లు చెప్పినం కాని రేపు మా పు అంటున్నారని పనులు చేపట్టడం లేదు అధి కారులు చూసి నూతన విద్యుత్ స్తంభం ఏర్పాటు చేయాలని గ్రామస్తులు కోరారు. – బర్ల వెంకన్న