Thursday, April 25, 2024

కరెంట్ ఎక్కువగా వాడడం వల్లే కేటగిరిల్లో మార్పులు: జగదీష్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

Current consumption high in summer

 

హైదరాబాద్: ప్రపంచమంతా కరోనా వైరస్‌తో స్తంభించిపోయిందని విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి తెలిపారు. మూడు నెలలుగా ప్రజలు ఇండ్లకే పరిమితం కావడంతో విద్యుత్ వినియోగం భారీగా పెరిగిందన్నారు. కరోనాపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పోరాడుతున్నాయన్నారు. లాక్‌డౌన్ సమయంలో విద్యుత్ సంస్థల పని పెరిగిందని, విద్యుత్ రీడింగ్ తీసేందుకు సిబ్బంది ఇండ్లకు వెళ్లలేదన్నారు. వేసవిలో కరెంట్ వినియోగం ఎక్కువగా ఉంటుందని, విద్యుత్ వినియోగదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. కరెంట్ ఎక్కువగా వాడడం వల్ల కేటగిరిల్లో మార్పులు వచ్చాయని, అందుకే బిల్లులు అధికంగా వచ్చాయన్నారు. ఈఆర్‌సి సూచనలు మేరకు గత ఏడాది మార్చి, ఏప్రిల్ బిల్లులను ఈ సారి వసూలు చేశాన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News