Home నిజామాబాద్ ప్రభుత్వ ఖజానాకు గండి కొడుతున్న తహశీల్దార్

ప్రభుత్వ ఖజానాకు గండి కొడుతున్న తహశీల్దార్

Currption Officer In Revenue Department In Nizamabad

మనతెలంగాణ/ బోధన్: రెవెన్యూ శాఖాలో పనిచేస్తు రెవెస్యూ వాహనాలు సొంతానికి వినియోగించుకోవడమే కాకుండా కార్యాలయాల్లో పనిచేస్తున్న విఆర్‌ఎలతో వెట్టి చాకిరీ చేయించడంతో పాటు సొంత పనులకు వినియోగించుకుంటున్న ఓ ప్రబుద్ధ్దుడి నిర్వాకం పై పలు విమర్శలు తలెత్తుతున్నాయి. ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లి వివిధ పనుల నిమిత్తం వెళ్లే ప్రజలకు నిబంధల పేరుతో కొరివి పెడుతూ ఇబ్బందులకు గురిచేయడంలో దిట్టగా పేరు పొందాడు. బోధన్ లోని రెవెన్యూ శాఖలో ఉన్నత మైన పదవిలో ఉంటూ ఆయన ఇతరులకు నిబంధానాల గూర్చి వివరిస్తూ తన సొంతానికి వచ్చే సరికి వాటిని పక్కన పెడుతూ వ్యవహరిస్తున్నాడు. ఇటీవల కాలంలో బోధన్ రెవెన్యూ అధికారుల కోసం ప్రభుత్వం కేటాయించిన వాహనాన్ని సొంతానికి వినియోగిస్తూ సదరు అధికారి భార్యను సైతం అదే వాహనంలో తీసుకెళ్లి విధులు చేయిస్తున్నాడు. సదరు అధికారి భార్య బోధన్ పట్టణంలోని గంజ్ ప్రాంతంలో ప్రభుత్వ ఉపాధ్యాయురాలిగా పనిచేస్తుంది. నిత్యం సదరు అధికారి ప్రభుత్వ వాహనంలోనే తీసుకెళ్తున్నట్టు ఆరోపణలు సైతం ఉన్నాయి. ఈ విషయమై మన తెలంగాణ దిన పత్రికలో సైతం సొంత పనులకు ప్రభుత్వ వాహనం అని కథనం సైతం ప్రచురిత మైంది. అంతటితో ఆగకుండా విఆర్‌ఎగా పనిచేస్తున్న యువకుడితో ప్రతి రోజు సొంత కారును శుభ్రం చేయించుకోవడంతో పాటు ఇంటి పనులు సైతం చేయింకుంటున్న విషయం సైతం వెలుగులోకి వచ్చింది. ఇంత జరుగుతున్నా సదరు అధికారి తీరులో మార్పు రాక పోవడంతో ప్రజాప్రతినిధులే కాకా సొంత శాఖలో పనిచేస్తున్న కింది స్థాయి సిబ్బంది సైతం సదరు అధికారి తీరుపై అసంతృప్తితో ఉన్నారు.

ప్రభుత్వ వాహనానికి వాడాల్సిన డీజిల్‌ను తహసీల్దార్ వినియోగించే కారు నంబరు ఏపీ 25 ఏకే 7065 తో ఉన్న సొంత వాహనం లో డీజిల్ పోసుకున్న విషయం పై పలు ఆరోపణలు వెల్లు వెత్తుతున్నాయి. ప్రభుత్వం సదరు అధికారికి వాహనాన్ని కేటాయించి నప్పటికీ వరుసగా డీజీల్‌ను మాత్రం అధికారి వినియోగించే వాహనంలో వేయడంలో ఆంతర్యమేంటని పలువురు విమర్శలు గుప్పిస్తున్నారు. వాస్తవానికి ప్రభుత్వ వాహనాలు లేని చోట ప్రైవేటు వాహనాల ( హైర్ వెహికల్) ను అధికారులు వినియోగించాలి. కాని ఇక్కడ మాత్రం అవేమి పాటించకుండా రెవెన్యూ శాఖలో చాలా స్ట్రిక్ట్ అధికారిగా పేరు పొందిన ఆయన మాత్రం తన భార్య పేరుతో ఉన్న వాహనాన్ని వినియోగించిప్రభుత్వం నుండి వచ్చే డీజిల్‌ను సొంత వాహనానికి వినయోగిస్తున్నాడు. అను నిత్యం సిబ్బందిని సైతం వేధింపులకు గురిచేస్తు ఆయన మాట వినని వారిపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసి మరో ప్రాంతానికి బదిలీ చేయిస్తాడు. ఆయనకు ఉన్నతాధికారుల అండ ఉందని తనను ఎవ్వరు ఏం చేయలేరని పేర్కొంటున్న అధికారి ఇలాంటి అక్రమాలకు పాల్పడి ప్రభుత్వ ఆదాయానికి గం డి కొడుతున్నాడు. ఇలాంటి అధికారుల పై తగు చర్యలు తీసుకోక పో తే రెవెన్యూ శాఖ పూర్తిగా అభాసు పాలు అయ్యే అవకాశం ఉంటుందని పలువురు పేర్కొంటున్నారు.
ఎలాంటి అక్రమాలకు పాల్పడలేదు
బోధన్ తహసిల్దార్ గంగాధర్:
తాను ఎలాంటి అక్రమాలకు పాల్పడలేదని తనపై లేని పోని ఆరోపణలు రావడం సహజమని తహసిల్దార్ వివరించారు. సొంత పనులకు వాహనాల వినియోగం పై మనతెలంగాణ వివరణ కోరగా పొంతన లేని సమాధానాలు చెప్పా రు. తహసిల్దార్ సొంత కారుకు ప్రభుత్వ ఖాతాలో డీజిల్ పోసుకు న్న విషయమై ప్రశ్నించగా సమాధానాన్ని దాటవేశారు.