Home వార్తలు ప్రతి భాగం ఔషధమే!

ప్రతి భాగం ఔషధమే!

custard-appleసీతాఫలాన్ని కస్టర్డ్ యాపిల్, షుగర్ యాపిల్ అని పిలుస్తారు. పచ్చి సీతాఫలం తినడానికి పనికిరాదు. దీన్ని రసం రూపంలో కాకుండా నేరుగా తినడమే మంచిది. గుజ్జు నోటిలోని జీర్ణరసాలను పెంచుతుంది. తద్వారా జీర్ణక్రియ వేగవంతమౌతుంది. సీతాఫలం ఆకు మొదలు గుజ్జు తిన్నాక పడవేసే గింజల వరకు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని వైద్యులు తెలుపుతున్నారు. దేహపుష్టి పెంపు నుంచి కొన్ని రకాల దీర్ఘకాలిక రోగాలను తగ్గించే శక్తి దీనిలో ఉంది. రోగ నిరోధక శక్తిని పెంపొందిస్తుంది.
# బరువు పెరగాలనుకునే వారు సీతాఫలం రసంలో తేనె, పాలు కలుపుకుని ప్రతిరోజూ తాగాలి. ఇది క్యాలరీలను పెంచుతుంది.
# గర్భిణీలు సీతాఫలం తినడం వల్ల పొట్టలో పెరిగే శిశువు మెదడు, నాడీ వ్యవస్థ, వ్యాధినిరోధకత పెరగడానికి తోడ్పడుతుంది. గర్భస్రావాన్ని నివారిస్తుంది.
# సీతాఫలంలో విటమిన్ బి6 అధికంగా ఉండటం వల్ల బ్రోంకైల్ ఇన్లమేషన్ తగ్గించి ఆస్తా టిక్స్ ఎటాక్‌ను తగ్గిస్తుంది.
# ఈ ఫలంలో ఉండే మెగ్నీషియం వల్ల గుండెజబ్బు రాకుండా కాపాడుతుంది.
# కాపర్, డైటర్ ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. మలబద్దకాన్ని నివారిస్తుంది.
# డైటరీ ఫైబర్ అధికంగా ఉన్నందున టైప్ టూ డయాబెటిస్ తగ్గిస్తుంది.
# దీనిలోని పొటాషియం, మెగ్నీషియం వల్ల రక్తపోటును అదుపులో ఉంచుతుంది.
# సీతాఫలంలోని నియోసిన్, డైటరీ ఫైబర్ అధికంగా ఉన్నందున కొలెస్ట్రాల్ లెవల్స్‌ను తగ్గిస్తుంది.
# ఈ ఫలంలోని ఫైబర్ అనీమియాను తగ్గిస్తుంది.
# దంత ఆరోగ్యానికి చాలా మంచిది. దంత క్షయాన్ని నివారిస్తుంది.
# దీనిలోని రెబోప్లెవిన్ విటమిన్ సి అధికంగా ఉండటం వల్ల కంటికి మంచిది. ఫ్రీరాడికల్స్‌ను నివారించి కంటి చూపును మెరుగుపరుస్తుంది.
# ఇందులోని మెగ్నీషియం వల్ల శరీరంలో నీటిని బ్యాలెన్స్‌గా చేయడానికి సహాయపడుతుంది. దానివల్ల జాయింట్ పెయిన్స్ రాకుండా కాపాడుతుంది.
# ప్రసవం తర్వాత బరువు తగ్గడానికి ఉపయోగపడుతుంది. మార్నింగ్ సిక్‌ను నివారిస్తుంది. అలసట, ఆకలి కోరికను తగ్గిస్తుంది.
# స్కిన్ ఎలర్జీని తగ్గిస్తుంది. క్యాన్సర్ రాకుండా కాపాడుతుంది.