Home తాజా వార్తలు శంషాబాద్ ఎయిర్ పోర్ట్ బాత్రూంలో భారీ ఎత్తున బంగారం

శంషాబాద్ ఎయిర్ పోర్ట్ బాత్రూంలో భారీ ఎత్తున బంగారం

Gold

తనిఖీల్లో తప్పించుకునేందుకు ప్రయాణికుడి ఎత్తుగడ
మనతెలంగాణ/హైదరాబాద్ : శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో బాత్రుంలో ఆదివారం తెల్లవారు జామున 2.99 కిలోల బరువున్న 26 బంగారు బిస్కెట్లను కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కస్టమ్స్ అధికారులు ప్రయాణీకులను సోదా చేస్తున్న క్రమంలో ఆదివారం తెల్లవారుజామున షార్జా నుంచి వచ్చిన ప్రయాణికుడు షేక్ అబ్దుల్ సాజిద్‌కు చెందిన రూ. 1.11 కోట్లు విలువైన బంగారు బిస్కెట్లను స్వాధీనం చేసుకున్నారు. షార్జా నుంచి హైదరాబాద్ వస్తున్న షేక్ అబ్దుల్ సాజిద్ అనే ప్రయాణికుడు అక్రమంగా బంగారం తరలిస్తున్నాడనే సమాచారంతో కస్టమ్స్ అధికారులు అప్రమత్తమయ్యారు. విమానాశ్రయంలో దిగిన సాజిద్ అధికారులు తనిఖీలు చేస్తున్నారనే విషయాన్ని గ్రహించి తాను తీసుకొచ్చిన బంగారాన్ని విమానాశ్రయంలోని మరుగుదొడ్డిలో పడేశాడు. కాగా సాజిద్‌ను తనిఖీ చేసిన కస్టమ్స్ అధికారులకు అతని వద్ద ఎలాంటి బంగారం లభించలేదు. దీంతో అదుపులోకి తీసుకొని విచారించగా బాత్రుంలో పడేసిన విషయాన్ని అధికారులకు చెప్పాడు. దీంతో బాత్‌రూంలో ఉన్న బంగారం స్వాధీనం చేసుకుని నిందితుడిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు కస్టమ్స్ అధికారులు తెలిపారు.

Customs officers Huge Gold Seized In Shamshabad Airport