Home తాజా వార్తలు శంషాబాద్ ఎయిర్‌పోర్టులో బంగారం పట్టివేత

శంషాబాద్ ఎయిర్‌పోర్టులో బంగారం పట్టివేత

Rajiv Gandhi International airport

 

రంగారెడ్డి: శంషాబాద్ ఎయిర్ పోర్టులో కస్టమ్స్ అధికారులు 820 గ్రాముల బంగారం స్వాధీనం చేసుకున్నారు. శనివారం ఉదయం కస్టమ్స్ డిప్యూటీ కమిషనర్ రవి ఆధ్వర్యంలో అధికారులు  సోదాలు నిర్వహించార. ఈ క్రమంలో దుబాయ్, రియాద్ నుంచి వచ్చిన ఇద్దరు ప్రయాణికులను కస్టమ్స్ అధికారులు అదుపులోకి తీసుకొని తనిఖీ చేశారు.  హైదరాబాద్ కు వారు అక్రమంగా తరలిస్తున్న బంగారాన్ని స్వాధీరనం చేసుకున్నారు. రియాద్ నుంచి వచ్చిన ప్రయాణికుడి వద్ద 600 గ్రాముల బంగారం, దుబాయ్ నుంచి వచ్చిన ప్రయాణికుడి వద్ద 220 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్టు అధికారులు వెల్లడించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Customs officers seized Gold in Shamshabad Airport