Home తాజా వార్తలు శంషాబాద్ ఎయిర్‌పోర్టులో అరకిలో బంగారం పట్టివేత

శంషాబాద్ ఎయిర్‌పోర్టులో అరకిలో బంగారం పట్టివేత

Shamshabad-Airport

హైదరాబాద్: శంషాబాద్ లోని రాజీవ్ గాంధీ ఇంటర్నెషనల్ ఎయిర్‌పోర్టులో మంగళవారం ఉదయం అక్రమంగా తరలిస్తున్న అరకిలో బంగారం పట్టుబడింది. ఓ వ్యక్తి షార్జా నుంచి రెండు బంగారు బిస్కెట్లను అక్రమంగా తీసుకువస్తుండగా తనిఖీల్లో కస్టమ్స్ అధికారులు వీటిని స్వాధీనం చేసుకున్నారు. సోదాలు నిర్వహించిన అధికారులకు సదరు వ్యక్తి ప్యాంట్ జేబులో రెండు బంగారు బిస్కెట్లు దొరికాయి. దీంతో ఆ వ్యక్తిపై కేసు నమోదు చేశారు.