…ప్రమాదాల జోన్లలో సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలి
మనతెలంగాణ/కాసిపేటః
ప్రయాణంలో ఇంటినుండి బయటకు వెళ్లింది మొదలు తిరిగి ఇంటికి చేరుకుంటామా అనే సందేహంలో వాహానదారులు, ప్రయాణికులు భయందోళనలను వ్యక్తం చేస్తున్నారు. సోమగూడెం నుండి బెల్లంపల్లి వరకు రద్దిగా వుండే రహాదారిపై బొగ్గు టిప్పర్లతోపాటు, ఆటోలు,ద్విచక్రవాహానాదారులు కొందరు అతి వేగంతో దుసుకు వెళ్తున్నారు. ముఖ్యంగా బొగ్గు టిప్పర్లు, ఆటోల వేగానికి అంతే లేకుండా పోతుందనే ఆరోపణలు వినవస్తున్నాయి. రహాదారులపై పోలీసులు వాహానాలను ఆపి దృవ పత్రాలకు సంబందించిన విషయంలో మాత్రం జరిమానాలు విదిస్తున్నారే తప్పా రహాదారిపై అతి వేగంగా వెళ్లె వాహానాలను గురించి పట్టించుకోవడం లేదని పలువురు బహిరంగంగానే ఆరోపిస్తుండడం గమనార్హం. ఇటివల సబ్బారావుపల్లె సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మందమర్రికి చెందిన చీల్ల గోపిరెడ్డి అనే వ్యక్తి మృతి చెందాడు. అలాగే రెండు రోజుల క్రితం సోమగూడెం సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆటోను వెనక నుండి ద్విచక్ర వాహానం అతి వేగంగా ఢి కొట్టడంతో కన్నెపల్లి గ్రామానికి చెందిన గోమాస అనిత అనే వివాహిత మృతి చెందగా ఆమె భర్త గాయపడ్డాడు. అంతే కాకుండా మధ్యం మత్తులో ఆటోను నడిపి చెట్టుకు ఢికొట్టడంతో ఆటో డ్రయివర్ తీవ్రంగా గాయాపడ్డాడు.
ఇన్ని ప్రమాదాలు కేవలం వారం రోజుల వ్యవదిలో జరిగినప్పటికి వాహానాల వేగాన్ని నియంత్రించడం లేదనే విమర్శలు వినవస్తున్నాయి. ఈ రహాదారిపై ప్రమాదాల జోన్లను సంబందిత శాఖ గుర్తించినప్పటికి, అక్కడ రూట్లను చూపే బోర్డులతో పాటు, ప్రమాద సూచికలు ఏర్పాటు చేయాల్సి వున్నప్పటికి సంబందిత శాఖ అధికారులు పట్టించుకోవడం లేదనే విమర్శలు వినవస్తున్నాయి. ఇటివల స్థానిక పోలీసులు మాత్రం కొన్ని చోట్ల రహదారి వెంట కొన్ని సూచన బొర్డులు మాత్రం పెట్టారు. మంచిర్యాల నుండి మెదలు బెల్లంపల్లి వరకు రహాదారులపై ఎన్నో ప్రమాద జోన్లు వున్నాయి. మూల మలుపులు, లింకురోడ్లు, రోడ్లను ఆనుకొని పెట్రోలు బంకులు వుండగా అక్కడ ప్రమాదాలు జరిగే అవకాశాలు ఎక్కువగా వున్నాయి. బెల్లంపల్లి నుండి మంచిర్యాలకు వెళ్లె రహాదారిలో ఇటివల అనేక రోడ్డు ప్రమాదాలు జరిగి పలువురు మృతి చెందగా అనేక మంది క్షతగాత్రులుగా మారిపోయారు. ఈ రహాదారిపై నిత్యం వేలాది వాహానాలు తిరుగుచుండగా రహాదారులపై ఏలాంటి ప్రమాద, సూచికలు లేక పోవడంతో నిత్యం ఎదో ఒక చోట రోడ్డు ప్రమాదం జరుగుతు రోడ్లు రక్తమోడుతున్నాయి. ఇదిలా వుండగా వాహానదారుల అతి వేగం, కొందరు వాహానదారులు మధ్యం సేవించి వాహానాలు నడపడం వల్ల కూడా ఎక్కువగా రోడ్డు ప్రమాదాలు జరుగుచున్నాయి. ఇప్పటికైన సంబందిత అధికారులు స్పందించి ప్రమాద సూచిక బోర్డులు ఏర్పాటు చేయడంతో పాటు, వాహానాల వేగాలను కూడా నియంత్రించాలని పలువురు కోరుచున్నారు.