Friday, April 26, 2024

ఐబిఎంలో వేలాది ఉద్యోగాలకు కోత

- Advertisement -
- Advertisement -

Cut to thousands of jobs at IBM

 

భారత్‌లో కూడా వందల మంది ఇంటికి..

న్యూఢిల్లీ: కరోనా సంక్షోభంతో ప్రముఖ అంతర్జాతీయ టెక్ దిగ్గజం ఇంటర్నేషనల్ బిజినెస్ మెషీన్స్ లిమిటెడ్ (ఐబిఎం) ఉద్యోగాల కోతకు నిర్ణయం తీసుకొంది. ప్రత్యేకమైన, క్లిష్ట పరిస్థితి నేపథ్యంలో ఉద్యోగులను ఇంటికి పంపించేందుకు నిర్ణయించింది. శుక్రవారం అర్ధరాత్రి మీడియాకు ఇచ్చిన ఒక ప్రకటనలో కంపెనీ ఈ విషయాన్ని ధ్రువీకరించింది. ఈ నిర్ణయం తమ ఉద్యోగుల్లో సృష్టించే కష్టమైన పరిస్థితిని గుర్తించి 2021 జూన్ నాటికి బాధిత ఉద్యోగులందరికీ ఐబిఎం సబ్సిడీ వైద్య కవరేజిని అందిస్తుందని కంపెనీ ప్రతినిధి ఒకరు తెలియజేశారు.

కోవిడ్19, లాక్‌డౌన్ కారణంగా సంభవించిన నష్టాలతో భారత సంతతికి చెందిన అరవింద్ కృష్ణ నేతృత్వంలోని టెక్ దిగ్గజం ఐబిఎం కూడా ఉద్యోగులను తొలగిస్తున్న కంపెనీల జాబితాలో చేరింది. అయితే తాజా నిర్ణయంతో ఒంతమంది ఉద్యోగులు ప్రభావితులవుతున్నారో ఐబిఎం వెల్లడించలేదు. కానీ వేలాది మంది ఉద్యోగాలు కోల్పోనున్నారని మీడియా నివేదికలు వెల్లడిస్తున్నాయి. ముఖ్యంగా మధ్యస్థాయి ఉద్యోగులపై వేటు వేయనుందని, అమెరికాలో కనీసం ఐదు రాష్ట్రాలో ్ల వేలాది మంది ఉద్యోగాలు కోల్పోయే అవకాశం ఉందని ఆ నివేదికలు అంటున్నాయి. వీరే కాకుండా భారత దేశంలో కూడా కొన్ని వందల మంది ఉద్యోగులు ప్రభావితం కానున్నారు. బాధిత ఉద్యోగులకు కంపెనీ మూడు నెలల జీతం ఇవ్వనుంది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News