Saturday, April 20, 2024

రెడ్డీస్ లాబోరేటరీపై సైబర్ ఎటాక్

- Advertisement -
- Advertisement -

Dr Reddy's Labs hit by a cyber attack

 

హైదరాబాద్‌ః హైదరాబాద్ కేంద్రంగా పని చేస్తున్న ఔషధాల తయారీ సంస్థ డాక్టర్ రెడ్డీస్ లాబోరేటరీస్‌పై సైబర్ ఎటాక్ జరగడంతో ప్రపంచవ్యాప్తంగా తన ఉత్పత్తులను నిలిపివేసినట్టు ఆ సంస్థ గురువారం నాడు ప్రకటించింది. రెడ్డీస్ లాబోరేటరీలో డేటా చోరీ యత్నాన్ని గుర్తించినట్లు డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్ సిబ్బంది గుర్తించింది. దీంతో డేటా చోరీ నివారణ చర్యల కోసం అన్ని డేటా సెంటర్లను వేరు చేసినట్లు తెలిపింది. ఈక్రమంలో ప్రస్తుతం ఐదు దేశాల్లో ఉన్న ఉత్పత్తిని వెంటనే నిలుపుదల చేసినట్టు పేర్కొన్న రెడ్డీస్ ల్యాబ్ ప్రతినిధులు పేర్కొంటున్నారు. కాగా ఉత్పత్తులు నిలిపివేసిన సంస్థలలో 24 గంటల్లోపు తిరిగి అందుబాటులోకి వస్తాయని స్పష్టం చేశారు.తమ సంస్థల్లో సైబర్ దాడి తమ కార్యకలాపాలపై పెద్దగా ప్రభావం చూపబోదని, అయినప్పటకీ అమెరికా, లండన్ , బ్రెజిల్, రష్యా, ఇండియాలోని ఆయా కంపెనీల్లో ఉత్పత్తి నిలిపివేసినట్టు వివరించారు. సైబర్ ఎటాక్‌తో పెద్ద మొత్తంలో నష్టం వాటిల్లిందని, సైబర్ ఎటాక్‌పై ఇప్పటికే ఫిర్యాదు చేశామని సంస్థ ప్రతినిధులు వివరిస్తున్నారు.

అయితే తమ సంస్థల్లో సైబర్ ఎటాక్ ఎవరు చేశారు అనే దానిపై విచారణ కొనసాగుతోంది, కరోనా వ్యాక్సిన్ కోసం ప్రపంచవ్యాప్తంగా ప్రయోగాలు జరుగుతున్న సమయంలో ఇలా జరగటం పలు అనుమానాలకు తావిస్తోందన్నారు. రెడ్డీస్ లాబోరేటరీలో స్పుత్నిక్ వి పేరుతో కరోనా వ్యాక్సిన్‌ను రష్యా గత నెలలో అభివృద్ధి చేసిన విషయం విదితమే. ఈ వ్యాక్సిన్‌పై భారత్‌లో ట్రయల్స్ నిర్వహించేందుకు డాక్టర్ రెడ్డీస్‌తో ఒప్పందం కుదిరింది. అయితే, రష్యా టీకా సామర్థంపై తొలుత అనుమానాలు వ్యక్తం కావడంతో డ్రగ్స్ నియంత్రణ సంస్థ దీనికి అనుమతి నిరాకరించింది. సంబంధిత సమాచారం అందిన నేపథ్యంలో స్పుత్నిక్ వి 2,3 దశల ట్రయల్స్ కోసం డాక్టర్ రెడ్డీస్‌కు ఇటీవల అనుమతి ఇచ్చింది. ఇదే సమయంలో సైబర్ ఎటాక్ జరగడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. రెడ్డీస్ లాబోరేటరీలో సైబర్ దాడిపై దర్యాప్తు చేపడుతున్నామని, అనతికాలంలో సైబర్ కుట్రకు పాల్పడిన వారిని గుర్తిస్తామని పోలీసులు పేర్కొంటున్నారు.

Cyber ​​Attack on Reddy’s Laboratories

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News