Thursday, April 25, 2024

మందుబాబులకు టోకరా.. ‘బగ్గా వైన్స్’ పేరుతో సైబర్ మోసం

- Advertisement -
- Advertisement -

 

హైదరాబాద్: కరోనా వైరస్ లాక్‌డౌన్ వల్ల మందుబాబులకు పడుతున్న తిప్పలు అన్నీ ఇన్నీ కావు. రోజు మద్యం తాగేవారి బాధలు వర్ణనాతీతం. దీనిని క్యాష్ చేసుకునేందుకు సైబర్ నేరస్థులు పలువురికి వలస విసురుతున్నారు. చిక్కిన వారి నుంచి డబ్బులు దోచుకుని మోసం చేస్తున్నారు. లాక్‌డౌన్ కారణంలో నగరంలో మద్యం షాపులు బంద్ కావడంతో ఆన్‌లైన్‌లో మద్యం విక్రయిస్తామంటూ మందుబాబులకు సైబర్ నేరస్థులు గాలం వేశారు. బగ్గా వైన్స్ పేరుతో క్యూఆర్ కోడ్ పంపించి నగదు ఆన్‌లైన్ ట్రాన్స్‌ఫర్ చేస్తే అరగంటలో మద్యం ఇంటికి పంపిస్తామని సైబర్ నేరస్థులు మెసేజ్ చేశారు. ఇది నిజమని నమ్మిన గౌలిపురాకి చెందిన రాహుల్ అనే వ్యక్తి ఆన్‌లైన్‌లో రూ.51,000 పంపించాడు. ఎంతకీ మద్యం రాకపోవడంతో మోసపోయానని గ్రహించి సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆన్‌లైన్‌లో మద్యం అమ్మకాలు చేసేందుకు ఎలాంటి అనమతి లేదని పోలీసులు స్పష్టం చేశారు.

Cyber Crime with Bagga Wines in Hyderabad

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News