Friday, April 26, 2024

పోలీస్ స్టేషన్లను తనిఖీ చేసిన సైబరాబాద్ సిపి

- Advertisement -
- Advertisement -
Cyberabad CP inspect police stations
రాజేంద్రనగర్, మైలార్‌దేవ్‌పల్లి పిఎస్‌లో తనిఖీలు
సిబ్బందితో మాట్లాడిన సిపి స్టిఫెన్ రవీంద్ర

హైదరాబాద్: నేరాలకు అనుగుణంగా పెట్రోలింగ్, గస్తీని పెంచాలని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ స్టిఫెన్ రవీంద్ర అన్నారు. సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని రాజేంద్రనగర్, మైలార్‌దేవ్‌పల్లి పోలీస్ స్టేషన్లను సిపి స్టిఫెన్ రవీంద్ర శనివారం తనిఖీలు నిర్వహించారు. ఆయా పోలీస్ స్టేషన్ల పరిధిలోని పాత నేరస్థులు, సస్పెక్ట్‌లు, రౌడీషీటర్లపై నిఘా ఉంచాలని అన్నారు. శాంతిభద్రతల పరిరక్షణ, మహిళా సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇవ్వాలని ఆదేశించారు. పోలీసులు అంకితభావంతో విధులు నిర్వర్తించాలని అన్నారు. సిబ్బందికి సమస్యలుంటే వెంటనే తన దృష్టికి తీసుకుని రావాలని కోరారు. ఏదైనా నేరం జరిగినప్పుడు సరైన సమాచారాన్ని, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి నేరస్థులను గుర్తించి, బాధితులకు న్యాయం చేయాలని అన్నారు. శాంతిభద్రతలు, నేరాలను అడ్డుకోవడంపై చర్చించారు. పోలీస్ స్టేషన్ల నిర్వహణ, రికార్డుల నిర్వహణను పరిశీలించారు. రిసెప్షన్, జిడి ఎంట్రీ తదితరాలను పరిశీలించారు. సిపి వెంట శంషాబాద్ డిసిపి ప్రకాష్ రెడ్డి, రాజేంద్రనగర్ ఎసిపి గంగాధర్, ఇన్స్‌స్పెక్టర్లు కనకయ్య, నరసింహ, వెంకటేశ్వర్లు, పవన్‌కుమార్, రాజేందర్, ఎస్సైలు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News