Friday, March 29, 2024

హాట్ స్పాట్లను గుర్తించండి

- Advertisement -
- Advertisement -

Cyberabad CP Stephen Ravindra Review on Road Safety

లింక్ రోడ్లపై సైన్‌బోర్డులను ఏర్పాటు చేయాలి
రోడ్డు భద్రతపై సైబరాబాద్ సిపి స్టిఫెన్ రవీంద్ర సమీక్ష
హాజరైన ట్రాఫిక్ ఇన్స్‌స్పెక్టర్లు

హైదరాబాద్: రోడ్డు ప్రమాదాలు జరిగే హాట్‌స్పాట్లను గుర్తించాలని ట్రాఫిక్ పోలీసులను సైబరాబాద్ పోలీస్ కమిషనర్ స్టిఫెన్ రవీంద్ర ఆదేశించారు. ఇటీవలి కాలంలో సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతుండడంతో సిపి స్టిఫెన్ రవీంద్ర బుధవారం తన కార్యాలయంలో రోడ్డు సేఫ్టీపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొత్తగా నిర్మించిన రోడ్లలో ప్రమాదాలు జరగకుండా, ట్రాఫిక్ అవగాహన కోసం సైన్ బోర్డులను ఏర్పాటు చేయాలని కోరారు. రోడ్లపై అవసరమైన లైటింగ్‌ను ఏర్పాటు చేయాలని, హాంకింగ్ లేకుండా చూడాలని, జంక్షన్లను అభివృద్ధి చేయాలని, యూటర్న్‌లు, ఫుట్‌పాత్,ఫుటోఓవర్ బ్రిడ్జిలను నిర్మించాలని అన్నారు.

ప్రస్తుతం సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో రోడ్డు ప్రమాదాలు జరుగుతున్న ప్రాంతాలను గుర్తించాలని ఆదేశించారు. ఆ ప్రాంతాలను ఇంజనీరింగ్ అధికారులతో కలిసి పరిశీలించి చర్యలు తీసుకోవాలని అన్నారు. అన్ని డిపార్ట్‌మెంట్ల అధికారులతో సమన్వయం చేసుకుని ముందుకు వెళ్లాలని ట్రాఫిక్ ఇన్స్‌స్పెక్టర్లను ఆదేశించారు. ట్రాఫిక్ విధులు నిర్వర్తించే పోలీసులు సమ్మర్ కిట్లను వెంటనే పంపిణీ చేయాలని ఆదేశించారు. సమావేశంలో జాయింట్ సిపి అవినాష్ మహంతి, రోడ్డు సేఫ్టీ డిసిపి ఎల్‌సి నాయక్, ట్రాఫిక్ ఎడిసిపి శ్రీనివాస్ రెడ్డి, కూకట్‌పల్లి ఎసిపి హన్మంతరావు, శంషాబాద్ ట్రాఫిక్ ఎసిపి విశ్వప్రసాద్, బాలానగర్ ట్రాఫిక్ ఎసిపి చంద్రశేఖర్ రెడ్డి, ఇన్స్‌స్పెక్టర్లు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News