Home తాజా వార్తలు ‘ఎస్బిఐ ధని లోన్ బజార్’ పేరిట నకిలీ యాప్ తో మోసం

‘ఎస్బిఐ ధని లోన్ బజార్’ పేరిట నకిలీ యాప్ తో మోసం

Cyberabad police bust fake call centre racket

 

హైదరాబాద్ : ‘ఎస్బిఐ ధని లోన్ బజార్’ పేరిట నకిలీ కాల్ సెంటర్లు ఏర్పాటు చేసి దేశవ్యాప్తంగా వందల కోట్ల మోసాలకు పాల్పడుతున్న ముఠాలను సైబరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. స్పూఫింగ్ యాప్ ద్వారా ఎస్బిఐ అసలైన కస్టమార్ కేర్ నుంచే ఫోన్ చేస్తున్నట్టుగా నమ్మించి మోసాలకు పాల్పడుతున్నట్లు తేల్చారు. రెండు ముఠాలుగా సెల్ ఫోన్లు, ల్యాప్ టాప్ లు, సిమ్ కార్డులు స్వాధీనం చేసున్నట్టు సైబరాబాద్ సిపి స్టిఫెన్ రవీంద్ర తెలిపారు. రుణాలు ఇస్తామని నకిలీ యాప్ తయారు చేసిన ముఠాలో 14 మందిని పోలీసులు అరెస్టు చేశారు. ఢిల్లీలోని ఉత్తమ్ నగర్ లో నకిలీ ఎస్బిఐ కాల్ సెంటర్ ను ఏర్పాటు చేశారు. ఈ కాల్ సెంటర్ నుంచి దేశవ్యాప్తంగా 33 వేల కాల్స్ చేసి కోట్ల రూపాయాలు కాజేసినట్టు గుర్తించారు.

ఈ ముఠాపై దేశవ్యాప్తంగా 209 కేసులు నమోదు అయినట్టు సిపి వెల్లడించారు. ఎస్బిఐ ఏజెంట్ల నుంచి ఖాతదారుల వివరాలను తీసుకొని క్రెడిల్ కార్డుల ద్వారా డబ్బులు కాజేస్తున్నారన్నారు. ఈ కేసులో అభిషేక్ మిశ్రా ప్రధాన నిందితుడిగా పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం అభిషేక్ మిశ్రా పరారీలో ఉన్నాడని, అతని కోసం గలిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. నకిలీ వెబ్ సైట్ లో లాగిన్ అయి వివరాలు తీసుకోని, ఫోన్ చేసి లోన్ వచ్చిందని  ఛార్జీల పేరిట డబ్బులు వసూలు చేస్తున్నారు. అరెస్టు అయిన వారిలో మహిళలు కూడా ఉన్నారని ఆయన తెలపారు. వారి నుంచి 17 సెల్ ఫోన్లు, 3 ల్యాప్ టాప్ లు, 5 సిమ్ కార్డులు స్వాధీనం చేసున్నారు. అసలైన యాప్ పేజీ పెట్టి నకిలీ యాప్ తయారు చేస్తున్నారు.

Cyberabad police bust fake call centre racket