Friday, April 19, 2024

సైబరాబాద్‌లో కొత్త చట్టం అమలు

- Advertisement -
- Advertisement -
Cyberabad traffic police are enforcing another new law
డ్రైవర్ మద్యం తాగి నడిపితే అందులో ఉన్న వారిపై కేసులు

హైదరాబాద్: సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు మరో కొత్త చట్టాన్ని అమలు చేస్తున్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్‌ల విషయంలో చాలా కఠినంగా వ్యవహరిస్తున్న సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు కొత్త చట్టాన్ని కూడా అంతే కఠినంగా అమలు చేస్తున్నారు. ఇప్పటి వరకు మద్యం తాగి వాహనం నడుపుతూ పట్టుబడిన వారిపై మాత్రమే కేసులు పెట్టేవారు. ఇక నుంచి మద్యం తాగి వాహనం నడిపే వ్యక్తి కారులో, బైక్‌పై కూర్చున్న వారిపై కూడా కేసులు నమోదు చేస్తున్నారు. డ్రైవర్ మద్యం తాగి ఉన్నాడని తెలిసి అందులో ప్రయాణించడం చట్టరీత్యా నేరమని సైబరాబాద్ ట్రాఫిక్ డిసిపి ఎస్‌ఎం విజయ్‌కుమార్ స్పష్టం చేశారు. దీనికి సంబంధించిన మోటార్ వాహనాల చట్టం 188వ సెక్షన్ ప్రకారం కేసులు నమోదు చేయనున్నట్లు తెలిపారు. దీంతో మద్యం తాగి వాహనం నడుపుతున్న డ్రైవర్‌తోపాటు అందులో ప్రయాణిస్తున్న వారు కూడా జైలుకు వెళ్లకతప్పదు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News