Wednesday, April 24, 2024

కృష్ణ గారి వీర డ్రైవింగ్ గాథ… మద్యం మత్తులో (వైరల్ )

- Advertisement -
- Advertisement -

Cyberabad Traffic Police Shared Drnk And Drive Fummy

హైదరాబాద్: మద్యం తాగి వాహనం నడపడం ఎంత ప్రమాదమో తెలిసిన కొందరు మందుబాబులు అవేమీ పట్టించుకోకుండా రోడ్లపైకి వస్తున్నారు. ఇష్టం వచ్చినట్టు వాహనాలు నడుపుతూ ప్రమాదాలకు కారకులు అవుతున్నారు. తాజాగా రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం ఇబ్రహీంపల్లి గేట్ దగ్గర ఓ బైకిస్ట్ సృష్టించిన హంగామా ఇది. ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించే వారిపై పోలీసులు చేసే ట్వీట్స్ కూడా మనము చూస్తుంటాము. ఇలాంటి ఘటనకు సంబంధించిన వీడియోను సైబరాబాద్ ట్రాఫిక్ ”పోలీసులు కృష్ణ గారి వీర డ్రైవింగ్ గాథ” అని ట్వీట్ చేశారు. రోడ్ల మీద వెళ్తున్న వాహనాదారులకు ఆ మందుబాబు కొంచెం సేపు భయందోళనకు గురిచేశాడు. ఆ వీడియో చూడడానికి నవ్వుతెప్పిస్తున్న తాగి వాహనాలు నడపడం వల్ల ఎన్నో ప్రమాదాలు జరుగుతాయని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News