Thursday, March 28, 2024

బంగాళాఖాతంలో తీవ్రవాయుగుండం: వాతావరణ శాఖ

- Advertisement -
- Advertisement -

Cyclone Alert for Andhra Coastal Area

హైదరాబాద్‌: తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తీవ్రవాయుగుండంగా మారిందని, దీంతో రాగల 12 గంటల్లో తుపానుగా మారే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. రేపు(ఆదివారం) సాయంత్రం కళింగపట్నం సమీపంలో తీరం దాటే అవకాశం ఉందని వెల్లడించింది. రేపు తీరం వెంబడి గంటకు 70 నుంచి 90 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని, దీని ప్రభావంతో ఏపిలోని కొస్తాంధ్రలో అక్కడకక్కడ ఓ మోస్తారు నుంచి భారీ వర్షాలు కురవనున్నట్లు పేర్కొంది. అలాగే, ఉత్తరాంధ్రలో పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో మత్స్యకారులు ఎవరూ సోమవారం వరకు సముద్రంలో వేటకు వెళ్లొద్దని ఏపి విపత్తుల శాఖ అదేశాలు జారీ చేసింది.

Cyclone Alert for Andhra Coastal Area

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News