Thursday, April 18, 2024

అరేబియా సముద్రంలో తీవ్ర వాయుగుండం

- Advertisement -
- Advertisement -

Cyclone alert for north Maharashtra south Gujarat

హైదరాబాద్: అరేబియా సముద్రంలో తీవ్ర వాయుగుండం ఏర్పడింది. ఈ వాయుగుండం మరో ఆరు గంటల్లో తుపానుగా మారనుందని కేంద్ర వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ తుపాన్ బుధవారం మధ్యాహ్నం ఉత్తర మహారాష్ట్ర, దక్కిణ గుజరాత్ తీరం దాటనుంది. తుపాన్ తీరాన్ని తానే సమయంలో 105-110 కిలీమీటర్ల వేగంతో గాలులు వీస్తాయి. దేశ ఆర్థిక రాజధాని ముంబైపైనే తుపాను ప్రభావం అధికంగా ఉంటుందని వాతావరణ శాఖ పేర్కొంది.

తుపాను హెచ్చరికలతో మహారాష్ట్ర, గోవా, గుజరాత్ లో హైఅలర్ట్ ప్రకటించారు. తుపాను ప్రభావిత రాష్ట్రాలు ఎన్డీఆర్ఎఫ్ బృందాలను సిద్ధం చేశాయి. ఇప్పటికే రుతుపవనాలు ప్రభావంతో కేరళ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. మనికొన్ని రోజుల్లో దేశమంతా రుతుపవనాలు విస్తరించి వర్షాలు కురవనున్నాయి. తెలంగాణలో గడిచిన రెండు రోజులుగా పలుచోట్ల వర్షాలు పడుతున్నాయి.

Cyclone alert for north Maharashtra south Gujarat

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News