Home తాజా వార్తలు దూసుకొస్తున్న’గజ’

దూసుకొస్తున్న’గజ’

Cyclone Gaja

పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన గజ తుఫాను మరింత బలపడుతోందని, తీరం వైపు గజ దూసుకొస్తోందని వాతావరణ శాఖ పేర్కొంది. మరో 12 గంటల్లో తీవ్ర తుఫానుగా మారే అవకాశం ఉందని తెలిపింది. ప్రస్తుతం ఇది చెన్నైకి 530, నాగపట్నానికి 620 కి.మీ దూరంలో కేంద్రీకృతమై ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. పశ్చిమ, వాయువ్య దిశలుగా కదులుతూ గురువారం మధ్యాహ్నం పంబన్-కడలూరు మధ్య తీరం దాటే అవకాశం ఉందని ఐఎండి పేర్కొంది. ప్రస్తుతం గంటకు 7కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తున్న గజ తుఫాను ప్రభావంతో తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లాతో పాటు దక్షిణ కోస్తాలో మోస్తారు నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.

Cyclone Gaja to commence rains over Tamil Nadu, AP

Telangana Breaking News