Tuesday, April 16, 2024

ఎపిలో భారీగా వర్షాలు

- Advertisement -
- Advertisement -

Cyclone Nivar Set to Hits Andhra Pradesh

అమరావతి: నివర్ తుఫాన్ ఆంధ్రప్రదేశ్ లోకి ప్రవేశించింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎపిలో 177 ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీవర్షాలు కురుస్తున్నాయి. నెల్లూరు జిల్లాలోని వెంకటగిరిలో అత్యధికంగా 304 మి.మీ వర్షాపాతం నమోదైనట్టు వాతావరణ శాఖ పేర్కొంది. కడప జిల్లా సంబేపల్లిలో అత్యల్పంగా 64.5 మి.మీ వర్షపాతం నమోదైంది. అటు నెల్లూరు జిల్లాలో 9 ప్రాంతాల్లో కుంభవృష్టి వర్షాలు కురుస్తుంది. కృష్ణ, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, కడప జిల్లాల్లో 96 ప్రాంతాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి. ఆంధ్రలో 24 గంటల పాటు భారీ వర్షాలు పడే సూచనలు ఉన్నాయని వాతావరణ అధికారులు తెలిపారు. గడిచిన 24 గంటల్లో 10 మండలాల్లో 200 మి.మీ వర్షపాతం నమోదైంది. మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లొద్దని అధికారులు హెచ్చరించారు.

Cyclone Nivar Set to Hits Andhra Pradesh

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News