Friday, April 26, 2024

త్వరలో డిఎ

- Advertisement -
- Advertisement -

DA release for Telangana govt employees soon

రాష్ట్ర సిబ్బందికి బకాయిపడిన కరువుభత్యం వెంటనే విడుదల

జోనల్ విధానంలో ఉద్యోగుల
సర్దుబాటు పూర్తికాగానే
ఖాళీలకు, కొత్త నియామకాలకు
నోటిఫికేషను ్లవిడుదల
వీలైనంత త్వరగా సర్దుబాటు
ప్రక్రియ ప్రగతిభవన్‌లో మంత్రి
శ్రీనివాస్‌గౌడ్ ఆధ్వర్యంలో
తనను కలిసిన టిజిఒల సంఘం
ప్రతినిధులకు సిఎం హామీ
ముఖ్యమంత్రికి టిజిఒ
అధ్యక్షురాలు మమత, ప్రధాన
కార్యదర్శి సత్యనారాయణ
కృతజ్ఞతలు కెసిఆర్ కృషి వల్లనే
స్థానికులకు 95% ఉద్యోగాలు
లభించనున్నట్టు వెల్లడి

హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ముఖ్యమంత్రి కెసిఆర్ శుభవార్త వినిపించారు. ప్రభుత్వ ఉద్యోగులకు బకాయి ఉన్న డిఏ విడుదలపై సిఎం కెసిఆర్ సానుకూలంగా స్పందించారని, వెంటనే విడుదల చేస్తామని హామినిచ్చారని టిజిఓ అధ్యక్షురాలు మమత, ప్రధాన కార్యదర్శి ఎ.సత్యనారాయణలు తెలిపారు. ఈ సందర్భంగా ఉద్యోగుల తరఫున ముఖ్యమంత్రి కెసిఆర్‌కు వారు కృతజ్ఞతలు తెలిపారు. టిజిఓ అధికారుల సంఘం చైర్మన్, వ్యవస్థాపక అధ్యక్షులు, మంత్రి శ్రీనివాస్‌గౌడ్ ఆధ్వర్యంలో సిఎం కెసిఆర్‌ను ప్రగతిభవన్‌లో టిజిఓ అధ్యక్షులు, ఇతర ఉద్యోగులు కలిశారు.

ఈ సందర్భంగా వారు పలు అంశాలపై చర్చించారు. దీంతోపాటు జోనల్ వ్యవస్థలో ఉద్యోగుల సర్ధుబాటు ప్రక్రియ పూర్తయిన తరువాత ఏర్పడే ఖాళీలకు, త్వరలోనే ఉద్యోగ నియామక నోటిఫికేషన్లు విడుదల చేస్తామని సిఎం తెలిపారని టిజిఓలు పేర్కొన్నారు. ఉద్యోగుల సర్ధుబాటు ప్రక్రియను వీలైనంత త్వరగా పూర్తి చేసేందుకు సహకరించాలని సిఎం కోరినట్టు వారు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం చేసిన కృషి వల్లే నిరుద్యోగులకు 95 శాతం ఉద్యోగాలు దక్కనున్నాయని టిజిఓలు తెలిపారు. సిఎంను కలిసిన వారిలో టిజిఓ రాష్ట్ర సహ అధ్యక్షులు సహదేవ్, హైదరాబాద్ జిల్లా అధ్యక్షులు ఎంబి కృష్ణయాదవ్, వెంకటయ్య, లక్ష్మణ్ తదితరులు ఉన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News