Thursday, April 25, 2024

సినీ కార్మికులు, వైద్య సిబ్బంది సంక్షేమం కోసం రూ.1 కోటి ఆర్థిక సాయం

- Advertisement -
- Advertisement -

suresh babu rana venkates

 

కరోనాపై పోరాటానికి దగ్గుబాటి కుటుంబం భారీ విరాళాన్ని ప్రకటించింది. కరోనా వ్యాప్తి నిరోధానికి నిరంతరం శ్రమిస్తోన్న వైద్య సిబ్బంది సంక్షేమం కోసం, సినీ కార్మికుల సంక్షేమం కోసం సురేష్ ప్రొడక్షన్స్ కోటి రూపాయల ఆర్థిక సాయాన్ని ప్రకటించడం విశేషం. షూటింగులు నిలిచిపోవడంతో ఇబ్బందులకు గురవుతున్న సినీ కార్మికులను ఆదుకోవడం తమ బాధ్యతగా భావించి వారికి ఆర్థిక సాయాన్ని అందజేస్తున్నామని డి.సురేష్‌బాబు, వెంకటేష్, రానా తెలిపారు. అలాగే తమ జీవితాలకు ప్రమాదమని తెలిసినా నిత్యం రోగులతో సన్నిహితంగా మెలుగుతూ వారి ఆరోగ్యం కోసం నిరంతరం శ్రమిస్తున్న వైద్య సిబ్బంది సంక్షేమం కోసం కూడా ఆర్థిక సాయాన్ని అందజేస్తున్నామని వారు చెప్పారు.

 

Daggubati family has announced huge Donation
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News