Friday, April 19, 2024

వాసాలమర్రి దళితుల ఖాతాల్లో రూ.6.6కోట్ల జమ

- Advertisement -
- Advertisement -
దళితుల ఖాతాలో జమైన రూ.10లక్షలు..
సిఎం కెసిఆర్ దేవుడు అని లబ్ధిదారుల నీరాజ‌నాలు
క్షేత్ర స్థాయి అవగాహన సదస్సులో దళిత బందు లబ్ధిదారులు

యాదాద్రి భువనగిరి: తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ దత్తత గ్రామం తుర్కపల్లి మండలం వాసాలమర్రి దళిత వాడల్లో ఆనందోత్సాహాలు నెలకొన్నాయి. వాసాలమర్రి గ్రామంలోని 66 దళిత కుటుంబాల ఖాతాల్లో రూ. 6.6 కోట్ల న‌గ‌దు జ‌మ అయింది. గురువారం ఉదయం నుంచి వారి సెల్‌ఫోన్ల‌కు బ్యాంక్ నుంచి ఎస్ఎంఎస్‌లు వస్తుండటంతో వారి ఆనందానికి అవధులు లేకుండా పోయింది. ఇక తమ కాళ్ల మీద తాము నిలబడేలా పౌల్ట్రీ, డెయిరీ ఫామ్ తదితర యూనిట్లను లబ్ధిదారులు ఎంపిక చేసుకున్నారు. ఈ మేరకు ఆయా యూనిట్లపై అవగాహన కల్పించేందుకు అధికారులు గురువారం లబ్ధిదారులను బస్సులో క్షేత్ర స్థాయి పర్యటనకు తీసుకెళ్లారు.

సిఎం కెసిఆర్ హామీ మేరకు యాదాద్రి భువనగిరి జిల్లాలోని వాసాలమర్రి దళితులకు దళితబంధు సాయం అందింది. సీఎం చెప్పినట్లుగా లబ్దిదారుల ఖాతాల్లో దళితబంధు నిధులు డిపాజిట్ అయ్యాయి. వాసాలమర్రిలోని 76 దళిత కుటుంబాలకుగానూ.. 66మంది ఖాతాల్లో నగదు జమైంది. ఒక్కొక్కరికి రూ.10 లక్షల చొప్పున నగదును జిల్లా కలెక్టర్ ఖాతా నుంచి లబ్దిదారుల అకౌంట్లలో ప్రభుత్వం జమ చేసింది.

ఇప్పటికే హుజూరాబాద్ లో లబ్దిదారుల కుటుంబాల్లో నగదు జమ చేసిన ప్రభుత్వం. తాజాగా జిల్లాలోని వాసాలమర్రి దళితులకు ద‌ళితబంధు డ‌బ్బులు వారిఖాతాల్లో జ‌మ కావ‌డంతో ద‌ళిత కుటుంబాల్లో ఆనందం వెల్లివిరిసింది. కేసీఆర్ దేవుడు అని నీరాజ‌నాలు ప‌లుకుతున్నారు. ద‌ళితులు ఆర్థికంగా ఎద‌గాల‌నే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ ద‌ళిత‌బంధు ప‌థ‌కాన్ని ప్ర‌తిష్టాత్మ‌కంగా ప్ర‌వేశ‌పెట్టిన సంగ‌తి తెలిసిందే.

‘‘తెలంగాణ దళిత బంధు’’ పథకం ద్వారా అందించే పది లక్షల నగదుతో పాటు, లబ్ధిదారుడు ప్రభుత్వం భాగస్వామ్యంతో రక్షణ నిధిని ఏర్పాటు చేస్తారు. లబ్ధిదారుల్లో ఆకస్మికంగా ఏదైనా ఆపద వాటిల్లినప్పుడు ఈ రక్షణ నిధిని నుంచి వారికి సహాయం అందుతుంది. ‘‘దళిత బంధు లబ్ధి ద్వారా ఉన్నత స్థితికి చేరిన దళిత కుటుంబం, ఏ పరిస్థితిలోనైనా ఆపదకు గురైనపుడు వారి పరిస్థితి దిగజారకుండా ఈ రక్షణ నిధి ఒక రక్షక కవచంగా నిలుస్తుంది. ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి దళితులను తీసుకపోవడానికే దళిత బంధు పథకం ఉద్దేశ్యం’’ అని సీఎం కేసీఆర్ తెలిపారు

క్షేత్ర స్థాయిలో అవగాహన సదస్సుకు దళితులు

ముఖ్యమంత్రి కేసీఆర్ దత్తత గ్రామం వాసాలమర్రి దళితబంధు లబ్ధిదారులను జిల్లా అధికారులు, గురువారం బస్సులో తీసుకోవేళ్లి లబ్ధిదారులకు క్షేత్ర స్థాయిలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈసందర్భంగా లబ్ధిదారులకు, పాడిపరిశ్రమ,కోళ్ల ఫార్మ్,గొర్రెల ఫామ్,వద్దకు తీసుకొనివేల్లి అందులోని మెలుకువలను,పాల దిగుబడి పెంచుకొనుటకు అవలంబించే పద్దతులను తెలియజేశారు. క్షేత్ర పరిశీలన కార్యక్రమం కోసం వాసాలమర్రి గ్రామానికి చెందిన 29 మందిని యాదగిరిగుట్ట మండలం ధర్మారెడ్డి గూడెం,చిన్న కందుకూరి గ్రామాల్లో భువనగిరి మండలం రాయగిరి గ్రామాల్లో అధికారులు క్షేత్రస్థాయిలో దళితులకు అవగాహన కల్పించారు.

ఈ కార్యక్రమంలో జిల్లా పశు సంవర్ధక అధికారి కృష్ణ, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ జినుకల శ్యామ్ సుందర్,గ్రామ సంచాలకులు డాక్టర్ ఐలయ్య,ఎంపిటీసీ పలుగుల నవీన్ కుమార్ ,ఎంపిడిఓ ఉమాదేవి,సూపరఁడెంట్ శ్రవణ్ కుమార్,పంచాయతీ కార్యదర్శి రమణారెడ్డి లబ్ధిదారులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News