Wednesday, April 24, 2024

లక్ష మందితో దళితబంధు బహిరంగ సభ

- Advertisement -
- Advertisement -

సిఎం కెసిఆర్ చిత్తశుద్ధితో ‘దళితబంధు’ను తీసుకొచ్చారు, 16న పండగ రోజే : మంత్రి గంగుల కమలాకర్

Dalit bandhu meeting in Hyderabad

మన తెలంగాణ/హుజూరాబాద్ : తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ పథకాలు దేశంలోని ఏ రాష్ట్రంలో లేవని, 24 గంటల నాణ్యమైన ఉచిత కరెంట్‌తో పాటు రైతు బం ధు, రైతుబీమా లాంటి అద్భుతమైన పథకాలు అందిస్తున్న రాష్ట్రంలో భాగస్వామ్యమైనందుకు గర్వపడుతున్నానని మంత్రి గంగుల కమ లాకర్ అన్నారు. ఈ నెల 16న సిఎం కెసిఆర్ నిర్వహించే ప్రతిష్టాత్మక దళిత బంధు పథకం బహిరంగ సభా వేదికను శాలపల్లిలో సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌తో కలిసి గంగలు కమలాకర్ పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి గంగుల మాట్లాడుతూ దళితుల ఓట్లతో ప్రధానులు, ముఖ్యమంత్రులు ఎందరో అయ్యారని, కానీ దళితుల పట్ల ఏ ఒక్కరు చిత్తశుద్ధ్దిని కనబర్చలేదన్నారు.

కేవలం ఓటు బ్యాంకుగా చూడటం ద్వారా వారు మరింత నిరుపేదలయ్యారని అన్నారు. సిఎం కెసిఆర్ చిత్తశుద్ధితో దళితబంధు లాంటి మంచి పథకాన్ని తీసుకు వచ్చినందుకు ఆనందంగా ఉందన్నారు. తెలంగాణ భారత దేశంలో అంతర్భాగం కాదా, తెలంగాణలో కడుతున్న పన్నుల్లోంచి, జిఎస్టిలోంచి మాకెందుకు నిధులివ్వరని బిజెపి నేతల్ని ప్రశ్నించారు. తెలంగాణ అందిస్తున్న రూ. 10 లక్షలకు అదనంగా మరో నలబై లక్షలు కేంద్రం నుండి తీసుకురావాలని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డితో పాటు బండి సంజయ్‌లను డిమాండ్ చేశారు. బిజెపి దళితుల వ్యతిరేక పార్టి అని స్పష్టమవుతుందన్నారు.

ప్రతి పథకంలో కేంద్రం వాటా ఉందని ప్రగల్బాలు పలికే బిజెపి నేతలు దళిత బంధుకు పిఎం వద్ద నుండి నిధుల్ని తేవాలన్నారు. ఈ నెల 16న సిఎం కేసిఆర్ సభకు దాదాపు లక్ష మందికి పైగా పరిమిత సంఖ్యలో నిర్వహిస్తున్నామన్నారు. 16వ తేదీ కోసం రాష్ట్రం మొత్తం ఆసక్తిగా ఎదురుచూస్తుందన్నారు. ఇప్పటికే హుజూరాబాద్‌లో బిజెపికి ఓటమి భయం పట్టుకుందని, అందుకే వాచ్ లు, కుట్టుమిషన్లు పంచుతూ ప్రజల్ని ప్రలోబపెడుతున్నారన్నారు.

చైతన్యవంతులైన ప్రజలు వీటిని తిరస్కరిస్తున్నారని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. సిఎం కేసిఆర్ సంక్షేమ, అభివృద్ది పథకాలే టిఆర్‌ఎస్‌ను గెలిపిస్తాయని, తెలంగాణకు శ్రీరామ రక్ష టిఆర్‌ఎస్ పార్టియే అన్న విషయాన్ని ప్రజలకు తెలుసన్నారు. ఈ కార్యక్రమంలో కరీంనగర్ మేయర్ సునీల్‌రావు, ఎస్సి కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్, సిపి సత్యనారాయణ, కలెక్టర్ ఆర్.వి కర్ణన్, పలువురు అధికారులు, ప్రజాప్రతినిధులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News