Saturday, April 20, 2024

నాడు డ్రైవర్లు.. నేడు ఆర్టీసి బస్సులకు ఓనర్లు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: నిన్న, మొన్నటి వరకు వారిద్దరు బస్సు డ్రైవర్లు కానీ ప్రస్తుతం దళిత బంధుతో అదే బస్సుకు ఓనర్లయ్యారు. సిఎం కెసిఆర్ తీసుకువచ్చిన ఈ పథకం వారి జీవితాల్లో వెలుగులు నింపింది. గతంలో నెలకు కేవలం రూ.లు 15వేల వేతనంతో కుటుంబాన్ని నెట్టుకొచ్చిన వారు ఇప్పుడు చెరో రూ.లు 60వేల వరకు సంపాదిస్తు ఆర్థికంగా బలపడుతున్నారు. చందుర్తి మండల కేంద్రానికి చెందిన రాగుల సాగర్, నేరేళ్ల శేఖర్ మొన్నటి వరకు ఆర్టీసి బస్సు డ్రైవర్లుగా పని చేసేవారు. వీరికి నెలకు రూ.లు 15వేల వేతనం రాగా, వాటితోనే తమ కుటుంబాన్ని పోషించుకుంటూ జీవనం సాగించే వారు.

ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన దళితబంధుతో ఒక్కసారిగా వారి కుటుంబాల్లో వెలుగులు వచ్చాయి. ఈ పథకం ద్వారా వీరికి ఒక్కొక్కరికి రూ.లు 10లక్షలు ఇవ్వడంతో బస్సును కొనుగోలు చేసి ఆర్టీసితో ఒప్పందం చేసుకున్నారు. దీంతో నిన్నటి వరకు డ్రైవర్లుగా ఉన్న వీరు బస్సుకు ఓనర్లుగా మారారు. అంతే కాకుండా బస్సు ద్వారా వీరికి నెలకు రూ.లు 1.20లక్షల నుండి రూ.లు 1.30 వరకు ఆదాయం వస్తుండడంతో ఆర్థికంగా బలపడుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News