Friday, April 19, 2024

దళిత యువకుడి చేత మూత్రం తాగించిన ఎస్ఐ

- Advertisement -
- Advertisement -

Dalit forced drink urine by SI

 

బెంగళూరు: మహిళ మిస్సింగ్ కేసులో దళిత యువకుడిని స్టేషన్‌కు రప్పించి అతడి మూత్రం తాగించిన సంఘటన కర్నాటక రాష్ట్రం చిక్కమంగళూరు మండలం మూడిగెరెలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… వివాహిత అదృశ్యమైన కేసులో పునీత్ అనే దళిత యువకుడిని స్టేషన్‌కు రప్పించారు. అతడి కాళ్లు, చేతులు కట్టేసి నేరం ఒప్పుకోవాలని చితకబాదడంతో పాటు అసభ్య పదజాలంతో తిట్టారు. తాగడానికి నీళ్లు అడిగితే కోపంతో ఎస్‌ఐ అర్జున్ అతడి చేత మూత్రం తాగించాడు. ఆరు గంటల పాటు చిత్రహింసలకు గురి చేసి విడిచిపెట్టారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సదరు ఎస్‌ఐపై కఠిన చర్యలు తీసుకోవాలని దళిత సంఘాలు డిమాండ్ చేశాయి. ఎస్‌ఐపై కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నామని ఉన్నతాధికారులు వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News