Saturday, April 20, 2024

రేపిస్టుల బారిన పడ్డ దళిత యువతి మృతి

- Advertisement -
- Advertisement -

Dalit girl rape and killed in UP

 

రేపిస్టుల బారిన పడ్డ దళిత యువతి మృతి
నాలుక తెగ్గోట్టారు. కాళ్లు విరగొట్టారు
రెండు వారాలు మృత్యువుతో పోరు
దళిత మహిళా సంఘాల నిరసన

న్యూఢిల్లీ/హత్రాస్ : సామూహిక అత్యాచారం, నాలుక తెగ్గెయడం, పలు విధాలుగా చిత్రవధలు అనుభవించిన ఉత్తరప్రదేశ్ దళిత యువతి మంగళవారం మృతి చెందింది. రెండు వారాల క్రితం యుపిలోని హాత్రాన్ జిల్లాలో ఓ గ్రామానికి చెందిన యువతి కాముకుల బారిన పడింది. సామూహిక మానభంగం, తీవ్రగాయాలతో దేశ రాజధాని ఢిల్లీలో చికిత్స పొందుతూ నిర్భయ ఘట్టాన్ని తలపిస్తూ ఈ 19 ఏండ్ల యువతి ఇప్పుడు కన్నుమూశారు. మృత్యువుతో పోరాడిన ఈ యువతి మరణంపై సర్వత్రా నిరసనలు వ్యక్తం అయ్యాయి. యుపిలో దారుణమారణకాండ పట్ల మహిళా సంఘాల నుంచి ఉద్యమాలు తలెత్తాయి. ఈ నెల 14వ తేదీన యుపిలో దారుణం జరిగింది. నలుగురు వ్యక్తులు బరితెగించి ఈ మహిళపై సామూహిక మానభంగానికి ఒడిగట్టారు. ఆమె అరుపులు కేకలు వినబడకుండా నాలుక కోశారు. తీవ్రస్థాయి రక్తస్రావం దశలో తొలుత ఆమెకు స్థానిక సఫ్దర్‌జంగ్ ఆసుపత్రిలో ఇన్నిరోజులూ చికిత్స జరిగింది.

అయితే వెన్నెముక దెబ్బతినడం, రక్తం బాగా పోవడంతో ఆమె చికిత్సకు సరైన విధంగా స్పందించలేకపోయింది. విషమ పరిస్థితుల్లోనే ఆమెను ఆసుపత్రిలో చేర్పించారు. సరైన విధంగా చికిత్స చేసినా ఆమె కోలుకోలేకపోయినట్లు ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. హాత్రాన్ జిల్లా పోలీసు సూపరిండెంట్ విక్రాంత్ వీర్ కూడా యువతి మృతిని ఆమె బంధువుల కథనం పేరిట ధృవీకరించారు. యువతి మృతి వార్త వెలుగులోకి రావడంతో స్థానిక ఆసుపత్రి ఎదుట నిరసనలు వెల్లువెత్తాయి. ఢిల్లీలో జరిగిన నిర్భయ ఉదంతాన్ని ఈ ఘటన తలపించిందని సామాజిక సంస్థల కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేశారు. బాధితురాలి కుటుంబానికి న్యాయం ఇప్పటికైనా జరుగుతుందా? అని అధికారులను నిలదీశారు. ఈ దళిత యువతిపై కామచర్యకు దిగి మరణానికి కారకులైన నలుగురు వ్యక్తులను అరెస్టు చేశారు. వీరిపై హత్యానేరం పరిధిలో ఐపిసి 302 సెక్షన్ కింద విచారణ జరుగుతుందని జిల్లా ఎస్‌పి తెలిపారు.

ఈ నెల 14వ తేదీన యువతి యువతి తల్లితో పాటు పొలం వద్దకు వెళ్లింది. అప్పటి నుంచి కన్పించకుండా పొయింది. తరువాత ఆమె తీవ్రగాయాలతో పడి ఉండగా కనుగొన్నారు. దుండగులు ఆమె నాలుకను చీల్చేశారు. గొంతునులిమే ప్రయత్నం చేశారు. ముందు జవహర్‌లాల్ నెహ్రూ మెడికల్ హాస్పిటల్‌లో, అలీఘఢ్ హాస్పిటల్‌లో చికిత్సకు చేర్పించారు. పరిస్థితి మెరుగు పడకపోవడంతో ఢిల్లీ ఆసుపత్రికి తరలించి మెరుగైన వైద్య చికిత్సకు ఏర్పాట్లు చేశారు. దుండగులు అత్యంత పాశవికంగా ఆమెపై దౌర్జన్యానికి దిగారు. కాళ్లు విరిగి , చేతులు దెబ్బతిని ఉన్నట్లు ఆసుపత్రి వైద్యులు గుర్తించారు.

నడవలేని, చేయి కదపలేని చివరికి మాట్లాడలేని దుస్థితిలో రెండు వారాల పాటు చికిత్స పొంది ఈ దళిత యువతి దుర్మరణం చెందారు. ఢిల్లీ సఫ్దర్‌జంగ్ ఆసుపత్రి ఎదుట భీమ్ ఆర్మీ అధినేత చంద్రశేఖర్ ఆజాద్ సారథ్యంలో ధర్నా జరిగింది. దుండగులకు తక్షణం మరణశిక్ష పడేలా దళితులంతా ఉద్యమించాల్సి ఉందని పిలుపు నిచ్చారు. తమ సహనాన్ని సర్కారు పక్షం పరీక్షిస్తోందని, ఇటువంటి దారుణాలను సహించేది లేదని ఆజాద్ హెచ్చరించారు. యువతి మృతి వార్తతో పెద్ద ఎత్తున నిరసనకారులు అక్కడికి చేరడంతో ఆసుపత్రి ఆవరణ అంతా ఉద్రిక్తత నెలకొంది. అత్యంత అమానుషంగా వ్యవహరించి, సభ్యసమాజానికి కళంకం తెచ్చిన ఈ రేపిస్టులను వెంటనే ఉరితీయాల్సి ఉందని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ డిమాండ్ చేశారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News