Home ఎడిటోరియల్ గుజరాత్‌లో దళిత ఉప్పెన

గుజరాత్‌లో దళిత ఉప్పెన

Editగుజరాత్ దళితులను 2016 జూలైలో సంభవించిన ఉనా ఘటన జ్ఞాపకాలు ఇంకా వెంటాడుతున్నాయి. ఏడాది తర్వాత ఇటీవల ఉత్తరప్రదేశ్‌లోని షహరాన్‌పూర్ జిల్లాలో సాగిన కుల ఘర్షణలు వారిని మరింత ఆగ్రహానికి గురిచేశాయి. పర్యవసానంగా గుజరాత్ దళితులు కొత్త ఉద్యమాన్ని ప్రారంభించారు.
దాదాపు 50 మంది దళిత కార్యకర్తలు ఆ రాష్ట్రంలో ఏకమై అంబేద్కర్ విచణ్ ప్రతిబంధ్ సమితి పేరిట ఒక కమిటీని నెలకొల్పారు. దాని ఆధ్వర్యంలో ఈ నెల 3న గుజరాత్ రాష్ట్రవ్యాప్తంగా దళితుల ర్యాలీ మొదలయింది. షహరాన్‌పూర్ వెళ్లి దళితులకు సంఘీభావం ప్రకటించి వచ్చిన కార్యకర్తలు చెప్పిన అక్కడి వాస్తవ కథల నుంచి ఈ కమిటీ పుట్టింది. అంబేద్కర్ వారసత్వాన్ని ప్రధాన పార్టీల రాజకీయ వాదులు ఎలా మంటగలుపుతున్నారో వారు వివరించారు. షహరాన్ పూర్‌లో దళితులపై హింసాకాండ తర్వాత స్థానిక బిజెపి ఎంపి రాఘవ్ లఖన్ పాల్ శర్మ ‘అంబేద్కర్ శోభా యాత్ర’ పేరిట ఒక ర్యాలీ తీశారు. ఆయన పార్టీ కార్యకర్తలు ఆ ర్యాలీలో అంబేద్కర్ ఫొటోలు చేతబట్టి పాల్గొన్నారు. వింత ఏమిటంటే – ఆ ర్యాలీలో ఒక్క దళితుడు కూడా కనపడలేదు. ఆ ర్యాలీ ముస్లింలు ఆధిక్యంలో ఉండే ప్రాంతాల గుండా వెళ్లింది. పాల్గొన్న వారు దారంతా ‘జై శ్రీరాం’, ‘యోగీ యోగీ’ అంటూ నినాదాలిచ్చారు. సమితి కన్వీనర్ మంజీభాయ్ జాదవ్ ఈ విషయం చెప్పారు.
ఇటీవల ముఖ్యమంత్రి ఆదిత్య నాథ్ సందర్శనకు రానున్న కుషి నగర్‌లో ముసాహర్ కులానికి చెందిన దళితులకు ‘పరిశుభ్రం కండి’ అని సబ్బులు, షాంపూను రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఘటనకు కూడా గుజరాత్‌లో దళితులు గట్టిగా నిరసన వ్యక్తం చేశారు. కుషి నగర్ ఘటనకు నిరసనగా గుజరాత్ వాల్మీకి కులానికి చెందిన దళిత మహిళ లు యుపి ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్‌కు గౌతమ బుద్ధుని బొమ్మ చెక్కి ఉన్న నాలుగు అడుగుల ఎత్తు, 125 కిలో గ్రాముల బరువు గల భారీ సబ్బును బహుమతిగా ఇస్తామని ప్రకటించారు. దళితులలో వాల్మీకిలు అత్యంత తక్కువ కులం వారుగా పరిగణించబడుతున్నారు. గత కొన్నేళ్లుగా బాబాసాహెబ్ అంబేద్కర్ వారసత్వాన్ని, పేరును ఎన్నికల ప్రయోజనాల కోసం ప్రధాన స్రవంతి రాజకీయ వేత్తలు దుర్వినియోగ పర్చారు. దళితులను ముస్లింలకు వ్యతిరేకంగా నిలబెట్టారు. ‘మా యాత్ర మా ఎన్నికైన ప్రతినిధుల ఈ విధమైన దుశ్చర్యలను ప్రశ్నించ డానికే ఉద్దేశించింది’ అని జాదవ్ చెప్పారు.
ఈ నెల 3న దళితుల ర్యాలీ అహ్మదాబాద్‌కు 100 కి.మీ దూరం లోని ధందుకా వద్ద మొదలైంది. 16న వడోదరాలో ఆ ర్యాలీ ముగుస్తుంది. దారి పొడవునా ప్రతి ఒక్క గ్రామం నుంచి దళితులు ఆ ర్యాలీలో చేరుతారు. ‘మీరు దళితులకు ఏమి చేశారు’ అని వారు రిజర్వుడ్ నియోజకవర్గాల నుంచి ఎన్నికైన 13 మంది ఎంఎల్‌ఎలను, ఇద్దరు ఎంపిలను ప్రశ్నిస్తారు. వారికి ప్రశ్నల జాబితాను అందించి సమాధానాలు కోరుతారు. జంజార్కా లోని బిజెపి రాజ్యసభ ఎంపి శంభూనాథ్ తుండియాను వారు ర్యాలీ ప్రారంభమైన రోజునే అతని స్వస్థలంలో కలిశారు. ఆ దళిత ఎంపిని ‘ధర్మగురు(మత నాయ కుడు)’గా ఆయా కులాల వారు కొలుస్తారు.
ఉనా సంఘటనతో సహనం కోల్పోయామని, ఇక అమీతుమీ తేల్చుకుంటామని అప్పట్లో ఆయన ప్రకటించారు. గుజరాత్‌లో దళితులు ఇక ఎటువంటి అణచివేతను సహించరని ఢంకా బజాయిం చారు. అటువంటి ప్రకటన చేసినందువల్ల తప్పనిసరి అనుకుని ర్యాలీకి వచ్చానని సమితి నాయకులతో ఆయన అన్నట్లు తెలిసింది. ఈ యాత్రలో ‘గో సంరక్షకులపై నిషేధం లేదా గట్టి ఆంక్షలు విధించ డానికి ఏమి చేశారు?’ వంటి ఎన్నికైన ప్రజా ప్రతినిధులకు సంధించ నున్న ప్రశ్నలతో కరపత్రాలు పంచుతున్నారు.
‘అశుద్ధాన్ని చేతులతో ఎత్తే దళితుల కోసం ఏమి ప్రత్యామ్నాయా న్ని డిమాండ్ చేస్తున్నారు?’ అన్న ప్రశ్న కూడా వాటిలో ఉంది. షహరాన్‌పూర్ హింసాకాండపై గుజరాత్ ఎంఎల్‌ఎలు ఎందుకు మౌనం వహిస్తున్నారు అన్నది కరపత్రంలోని కీలక ప్రశ్న. ఈ కర పత్రం ఆరు పేజీల పొడవు ఉంది. ‘భీమ్ సైన్యం’కు, నక్సలైట్లకు మధ్య సంబంధం ఉందని నిరూపించడానికి ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ప్రయ త్నించడంతో దళితులు ఆందోళన చెందుతున్నట్లు కూడా దానిలో పేర్కొన్నారు. ఈ కార్యకర్తల బృందం ర్యాలీలో భాగంగా ప్రతి జిల్లాలో లక్ష మంది దాకా దళితులను కలుసుకోవాలని లక్షంగా పెట్టుకుంది.
‘ప్రతి జిల్లాలో ర్యాలీకి తప్పనిసరిగా అనుమతి తీసుకోవాలి. ఇటు వంటి సమస్యలు ర్యాలీ నిర్వహణలో ఎదురవుతున్నాయి. అయిన ప్పటికీ స్పందన అద్భుతంగా ఉంది. దళిత మహిళలు కూడా ర్యాలీలో పెద్ద సంఖ్యలో పాల్గొంటున్నారు’ అని జాదవ్ తెలిపారు. గుజరాత్ లోని ఉనాలో సుమారు ఏడాది క్రితం చనిపోయిన ఆవు చర్మాన్ని ఒలిచే వృత్తి ధర్మం పాటిస్తున్న నలుగురు దళిత యువకులను గో సంరక్షకులు తీవ్రంగా కొట్టిన ఘటన దేశమంతటా ప్రకంపనలు సృష్టించింది. ఈ ఘటనకు నిరసనగా గుజరాత్‌లో చాలా చోట్ల దళితులు ‘చనిపోయిన పశువుల చర్మం ఒలిచే’ తమ కుల వృత్తిని మానుకున్నారు. ఫలితంగా చాలా ఊళ్లలో పశుకళేబరాల సమస్య తీవ్ర మైంది.
వాటిని తొలగించి పరిశుభ్రతకు పాటుపడే వారిని పాశవికంగా అడ్డుకుంటున్న గో సంరక్షకుల చర్యలను దేశ వ్యాప్తంగా సామాజిక కార్యకర్తలు, మేధావులు నిరసించారు. గుజరాత్ దళితులకు సంఘీ భావం ప్రకటించారు. గో సంరక్షకుల దుశ్చర్యలు ఇటీవల దేశంలో చాలా చోట్ల తీవ్ర నిరసనలకు కారణమయ్యాయి. ఉనా సంఘటనకు ముందు ఉత్తరప్రదేశ్‌లోని దాద్రీలో అత్యంత క్రూరంగా ఒక ముస్లిం వ్యక్తిని గో సంరక్షకులు చంపిన ఘటన జరిగింది. బీరువాలో ‘ఆవు మాంసం’ దాచుకున్నారన్న ఆరోపణపై కొందరు గో రక్షకులు మహమ్మద్ అఖ్లాక్ అనే ముస్లింను తీవ్రంగా కొట్టి చంపారు. ఆ దాడిలో ఆయన కుమారుడు కూడా తీవ్రంగా గాయ పడ్డాడు. తర్వాత ల్యాబ్ పరీక్షల్లో ఆ మాంసం ఆవుది కాదని, మేకదని తేలింది.
బిజెపి ప్రభుత్వం ఆ ల్యాబ్ నివేదికను గుర్తించకుండా రాజకీయం చేయడానికి తెగబడింది. గో సంరక్షకుల అకృత్యాలను నివారించ డానికి బదులు కేంద్రం వారికి వంతపాడుతూ ఇటీవల గో వధను నిషేధిస్తూ, ఇతర పాడి పశువుల క్రయ విక్రయాలను నియంత్రిస్తూ ఆంక్షలు తెచ్చింది. వీటికి కూడా దేశ వ్యాప్తంగా నిరసనలు రావడంతో కొంచెం వెనక్కి తగ్గి, గేదెల వధను నిషేధం నుంచి తొలగిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఇవన్నీ దళితులను సమాజం నుంచి వేరు చేసే చర్యలే అని మేధావులు విమర్శిస్తున్నారు.

* దమయంతీ ధార్