Friday, April 19, 2024

ఆదివాసి గూడల్లో దండారి సంబరాలు

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/నేరడిగొండ: దీపావళికి వారం రోజుల ముందుగా ఆదివాసులు ఎదురుచూసే అతి పెద్ద సంబరం గుస్సాడీ దండారి(బోగి) ఉత్సవాలను శుక్రవారం గ్రామాల్లో గ్రామ పటేల్ ఇంటి ముందు ఏత్మాసుర్ దేవతలకు అత్యంత భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించారు. నేరడిగొండ మండలంలోని నాగమల్యాల్, రోల్‌మామడ, యాపల్‌గూడ తదితర గ్రామాల్లో వారం రోజుల ముందుగా దండారి(బోగి) ఉత్సవాలు నాటికలు, పాటలు, నృత్యలు, కోలాటం ప్రత్యేక కార్యక్రమాలు ఆదివాసులు ఆయా గ్రామాల నుంచి వచ్చి ఉత్సాహంగా పాల్గొని నిర్వహిస్తారు. మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో లక్ష్మణ్, కృష్ణ, గ్రామపెద్దలు, గామస్థులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News