Home తాజా వార్తలు పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా..

పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా..

Darbar

సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా స్టార్ డైరెక్టర్ ఏ.ఆర్.మురుగదాస్ తెరకెక్కిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘దర్బార్’. లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఎ.సుభాస్కరన్ అత్యంత భారీ బడ్జెట్‌తో, హై టెక్నికల్ వాల్యూస్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రజనీ ఒక పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్న ఈ సినిమాను అన్ని కమర్షియల్ హంగులతో మురుగదాస్ తెరకెక్కిస్తున్నారు. అనిరుధ్ రవిచంద్రన్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన రజనీ పోస్టర్లకు అద్భుతమైన స్పందన వస్తోంది. ఈ సినిమాను 2020 సంక్రాంతి కానుకగా విడుదల చేయనున్నారు.

‘దర్బార్’ తెలుగు మోషన్ పోస్టర్‌ను సూపర్‌స్టార్ మహేష్‌బాబు గురువారం సాయంత్రం రిలీజ్ చేశారు. ఆదిత్య అరుణాచలం పాత్రలో రజనీకాంత్ పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపించిన ఈ మోషన్ పోస్టర్ అనిరుధ్ పవర్‌ప్యాక్‌డ్ మ్యూజిక్‌తో సినిమా మీద అంచనాలను మరింత పెంచింది. ఇక ఈ మోషన్ పోస్టర్‌ను తమిళ్‌లో యూనివర్సల్ హీరో కమల్‌హాసన్, హిందీలో సల్మాన్‌ఖాన్, మలయాళంలో మోహన్‌లాల్ విడుదల చేశారు. రజనీకాంత్ సరసన నయనతార హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాలో నివేత ధామస్ ఒక ముఖ్య పాత్రలో నటిస్తోంది. సునీల్ శెట్టి, తంబీ రామయ్య, యోగి బాబు, ప్రతీక్ బబ్బర్, నవాబ్ షా తదితరులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీః సంతోష్ శివన్, ఎడిటర్‌ః శ్రీకర్ ప్రసాద్.

Darbar Motion Poster